Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీకి మర్రి రాజశేఖర్ గుడ్ బై.. జగన్ మీటింగ్ కి గైర్హాజరు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరో కీలక వైసీపీ నేత.... జగన్‌కు షాక్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. పార్టీ సీనియర్‌నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌.. ఫ్యాన్ పార్టీని వీడతారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి.. ఆయన సైకిల్‌పై సవారీ చేసేందుకు సుముఖంగా ఉన్నాట్టు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో పార్టీ అధినేత జగన్ నిర్వహించిన సమావేశానికి హాజరు కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ మీటింగ్ కి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని హాజరయ్యారు. అలానే ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు, బొల్లా సహా నియోజకవర్గాల సమన్వయకర్తలు సైతం హాజరయ్యారు. అలాగే ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

Marri Rajasekhar good bye to YCP absent for Jagan meeting

ఈ క్రమంలోనే మర్రి రాజశేఖర్ సమావేశానికి హాజరు కాకపోవడం పార్టీ మారుతున్నారనే వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. మర్రి రాజశేఖర్ కొన్ని రోజులుగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. చిలకలూరిపేట ఇన్‌ఛార్జిగా విడదల రజినిని నియమించిన నాటి నుంచి ఆయన అసహనంలో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత లేటెస్ట్ ఎన్నికల్లో మరో నేతకు సీటు కట్టబెట్టడం.. రజినీ మరో స్థానంలో పోటీ చేసినా.. ఇటీవల తిరిగి మళ్లీ చిలకలూరిపేట ఇంచార్జ్ గా జగన్ నియమించారు.

అయితే స్థానికంగా ఎమ్మెల్సీగా ఉన్న తనకు చెప్పకుండానే.. రజినీని మళ్లీ నియమించారని మర్రి రాజశేఖర్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట. వైసీపీ కోసం ఎన్నో కష్టాలుపడినా మొదట్నుంచి మర్రికి సరైన గుర్తింపు లేదని ఆయన అనుచరులు సైతం మండిపడుతున్నారట. గత ఎన్నికలకు ముందే MLC ఇచ్చి సరిపెట్టారని.. గతంలోనూ మంత్రి పదవి ఇస్తామని ప్రకటించిన జగన్‌... ఆ హామీని సైతం పక్కన పెట్టారని ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లోనే మర్రి రాజశేఖర్ పార్టీ మారడం పక్కా అంటూ చిలకలూరిపేట నియోజకవర్గం వ్యాప్తంగా టాక్ నడుస్తోంది. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే టాక్‌ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే... ఈ నెలాఖరు లోపు మర్రి రాజశేఖర్‌ ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+