వివాహిత దారుణ హత్య: భర్త ప్రమేయం ఉందా?
గుంటూరు జిల్లా నంబూరులో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మెడకోసి ఆమెను హత్య చేశారు. ఈ హత్యలో భర్త ప్రమేయం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గుంటూరు జిల్లా నంబూరులో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మెడకోసి ఆమెను హత్య చేశారు. ఈ హత్యలో భర్త ప్రమేయం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గుంటూరు: గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని నంబూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. బహిర్భూమికి వెళ్ళిన ఆమెను మెడకోసిహత్య చేశారు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడు పాలెంకు చెందిన జ్యోతి (25)కి నంబూరు విజయభాస్కరనగర్‌కు చెందిన సురేష్‌తో ఏడేళ్ళ క్రితం వివాహమైంది.
వారికి ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. కొంత కాలంగా భార్యాభర్తలకు మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయి. దీంతో జ్యోతి పుట్టింటికి వెళ్ళి మూడు రోజుల క్రితం నంబూరుకు తిరిగి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో ఇంట్లో నుంచి దుస్తులు తీసుకుని గుంటూరు చానల్‌లో వాటిని ఉతికి తీసుకొస్తానని వె ళ్ళింది.

అక్కడ బట్టలు ఉతుక్కుంటున్న మహిళతో తన దుస్తులు చూస్తుండండి, బహిర్భూమికి వెళ్ళి వస్తానని చెప్పి గుంటూరు చానల్ పక్కనే ఉన్న పొదల వైపు వెళ్ళింది. అక్కడ హత్యకు గురైంది. సోమవారం ఉదయం వరకు కూడా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో గ్రామంలో విచారణ చేశారు. గ్రామానికి చెందిన ఒకరు గుంటూరు చానల్ పక్కన ఉన్న ముళ్ళ పొదలలో మృతదేహం ఉందని చెప్పగా అక్కడకు వెళ్ళి పరిశీలించారు.
జ్యోతిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హతమార్చినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు మార్చురీకి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అర్బన్ ఏఎస్పీ సుబ్బరాయుడు, నార్త్ జోన్ డీఎస్పీ రామాంజనేయులు, సీఐ చంద్రమౌళి, ఎస్‌ఐ కృష్ణయ్య తదితరులు జ్యోతి మృతదేహాన్ని పరిశీలించారు. హత్యపై పోలీసు అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆమెను ఒక వ్యక్తి చంపడం సాధ్యం కాదని, ఈ ఘటనలో ఇద్దరు ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చని భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా మనస్పర్ధలు నెలకొని ఉన్నందున ఈ హత్యలో భర్త ప్రమేయం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తపరిచారు. భార్యాభర్తల ఇద్దరి సెల్‌పోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications