టీ కోసం వచ్చి మహిళపై అత్యాచారం, ఆపై హత్య
చిత్తూరు/ శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వివాహితపై దుండగులు అత్యాచారం చేసి, హత్య చేశారు.
యాదమర్రి మండలం, వరిగపల్లి జాతీయ రహదారిపై కళావతి అనే వివాహిత టీ స్టాల్ నడుపుతోంది. తెల్లవారి జామున టీ కోసం వచ్చిన దుండగులు మహిళపై అత్యాచారం జరిపారు. అనంతరం ఆమె తలపై కర్రతో కట్టి చంపారు.
ఇది గమనించిన పిల్లలు గట్టిగా కేకలు పెట్టడంతో అటుగా వెళుతున్న వ్యక్తి ఘటనా స్థలానికి వచ్చాడు. ఆ వ్యక్తిపై కూడా దుండగులు దాడి చేశారు. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
వేగంగా వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఆటోను ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మరణించారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం రేవులబయలు గ్రామం వద్ద ఆర్టీసీ అద్దెబస్సు ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృతి
శ్రీకాకుళం జిల్లాలోని జాతీయ రహదారిపై పాత పెట్రోలు బంక్ సమీపంలో వేగంగా వస్తున్న ఓ కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications