వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి నంద్యాల బెట్టింగ్ ఫీవర్: సానుభూతి వర్సెస్ నైతికత?.. జనం ఎటువైపో!

రాజకీయ విశ్లేషకులకు ఫోన్లు చేసి మరీ.. ఎవరి బలాబలాలేంటో వీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. రెండు పార్టీలు పోటాపోటీగా గెలుపు ప్రయత్నాల్లో తలమునకలవడంతో.. విజయం ఎవరిని వర్తిస్తుందా? అన్న ఆసక్తి కొనసాగుతోంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి బెట్టింగ్ రాయుళ్లు అప్పుడే రంగంలోకి దిగిపోయారు.

జగన్ స్వయంకృతాపరాధం?: చేజేతులా టీడీపికి కొత్త 'అస్త్రం', వ్యూహం మార్చిన ప్రత్యర్థి?జగన్ స్వయంకృతాపరాధం?: చేజేతులా టీడీపికి కొత్త 'అస్త్రం', వ్యూహం మార్చిన ప్రత్యర్థి?

రాజకీయ విశ్లేషకులకు ఫోన్లు చేసి మరీ.. ఎవరి బలాబలాలేంటో వీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. కొందరైతే నేరుగా జనం వద్దకే వెళ్లి.. ఎవరు గెలుస్తారో చెప్పాలంటూ ఆరా తీస్తున్నారట. నంద్యాల ఉపఎన్నిక ఫీవర్ కు బెట్టింగ్ కూడా తోడవడంతో టీడీపీ వర్సెస్ వైసీపీ పోరుపై మరింత ఉత్కంఠ నెలకొంది.

వైసీపీకి చిక్కక టీడీపీలోకి: డిసైడ్ చేసేది ముస్లింలే.. ఇదీ నంద్యాల 'రియాలిటీ'?వైసీపీకి చిక్కక టీడీపీలోకి: డిసైడ్ చేసేది ముస్లింలే.. ఇదీ నంద్యాల 'రియాలిటీ'?

కుల సమీకరణాలపై ఫోకస్:

కుల సమీకరణాలపై ఫోకస్:

కుల సమీకరణాలను బేరీజు వేసుకుని.. ఆయా సామాజిక వర్గాలను తమవైపుకు తిప్పుకునేందుకు రెండు పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతుండటంతో.. ఏ సామాజిక వర్గంలో ఎవరికెన్ని ఓట్లు పడుతాయన్న దానిపై బెట్టింగ్ రాయుళ్లు ఫోకస్ చేశారు.

స్థానికేతరులైతే నంద్యాలలో ఉన్న తమ స్నేహితులకు, బంధువులకు, పరిచయస్తులకు ఫోన్లు చేసి గెలుపోటములపై అభిప్రాయాలు కోరుతున్నారట. ముఖ్యంగా నాయకుల డ్రైవర్లు, గన్ మెన్స్, వారికి సన్నిహితంగా ఉండేవారి వద్ద నుంచి సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Nara Lokesh Challenges YS Jagan over Land Pooling
బెట్టింగ్ ఫీవర్:

బెట్టింగ్ ఫీవర్:

పందేలకు కేరాఫ్ అయిన భీమవరంతో పాటు విజయవాడ, విశాఖపట్నం, ప్రకాశం, గుంటూరు, కడప తదితర చోట్ల నంద్యాల ఉపఎన్నికపై జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ ఫీవర్ హైదరాబాద్ కు కూడా పాకినట్లు ప్రచారం జరుగుతోంది.

బెట్టింగ్ రాయుళ్లే రాజకీయ విశ్లేషకుల అవతారం ఎత్తి.. ఏ పార్టీకి ఎంతమేర అవకాశాలు ఉన్నాయో చెబుతున్నారట. కొంతమంది స్థానికేతరులు తమ అనుచరులను నంద్యాలకు పంపించి మరీ అంతర్గత సర్వేలు చేయిస్తున్నారట.

సానుభూతా?.. నైతికత?:

సానుభూతా?.. నైతికత?:

సానుభూతే ప్రధానంగా మంత్రి అఖిలప్రియ జనంలోకి వెళ్తుండగా.. నైతికతను చూసి ఓటేయాలని శిల్పా బ్రదర్స్ నంద్యాల ప్రజానీకాన్ని కోరుతున్నారు. భూమా హయాంలో నంద్యాల నిర్లక్ష్యానికి గురైందని శిల్పా బ్రదర్స్ చెబుతుండగా.. తమ కుటుంబం నంద్యాల ప్రయోజనాలకు కట్టుబడి ఉందని అఖిలప్రియ ప్రచారం చేస్తున్నారు.

ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన తర్వాతే శిల్పా చక్రపాణిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడంతో.. టీడీపీని జగన్ ఇరకాటంలోకి నెక్కారు. వైసీపీ టికెట్ పై గెలిచి టీడీపీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న అఖిలప్రియ నైతికతపై వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో జనం సానుభూతిని ప్రదర్శించి అఖిలప్రియ వైపు నిలుస్తారా? లేక వైసీపీ చెబుతున్న నైతికతను విశ్వసిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే, తండ్రి చావుకు కారణమైన వారితో తిరుగుతూ.. ఆయన ఫోటో పెట్టుకుని ఎలా ఓట్లు అడుగుతావ్? అంటూ వైసీపీ సంధిస్తున్న ప్రశ్నలకు అఖిలప్రియ కూడా ధీటుగానే సమాధానం చెప్పారు. జగన్ ఆయన తండ్రి ఫోటో పెట్టుకుంటే లేనిది తాను తండ్రి ఫోటోతో జనంలోకి వెళ్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. అనవసర విమర్శకు పోకుండా.. ఎమ్మెల్యే రోజా ఆవేశంలో మాట్లాడి ఉంటారని అఖిలప్రియ కాస్త హుందాగానే బదులిచ్చారు.

దూకుడు పెంచిన వైసీపీ:

దూకుడు పెంచిన వైసీపీ:

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది వైసీపీ దూకుడు పెంచుతోంది. విమర్శలతో టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తూ నంద్యాల రాజకీయాలను శాసించేందుకు ప్రయత్నిస్తోంది. నంద్యాలలో ఈ పనిని శిల్పా బ్రదర్స్ భుజానికెత్తుకోగా.. మీడియా ముఖంగా ఎమ్మెల్యే రోజా టీడీపీని కడిగిపారేసే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తం మీద విమర్శల విషయంలో టీడీపీపై వైసీపీదే పైచేయిగా కనిపిస్తోంది.

అయితే శృతిమించిన విమర్శలు కూడా నష్టం చేకూరుస్తాయన్నది పార్టీ గమనించాల్సిన విషయం. నంద్యాల బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే దుమారం రేగిన నేపథ్యంలో.. ఆచీ తూచీ వ్యవహరిస్తేనే పార్టీపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉంటుంది.

మరోవైపు టీడీపీ కూడా సైతం క్షేత్ర స్థాయిలో బాగానే ప్రచారం చేస్తోంది. జగన్ నాయకత్వాన్ని ఉన్మాదంతో పోలుస్తూ.. ఆయన కావాలా? చంద్రబాబు కావాలా? తేల్చుకోవాలంటూ ప్రచారం చేస్తోంది. ఇరు వర్గాలు నంద్యాల ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకోవడంతో అంతిమ విజయం ఎవరని వర్తిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

English summary
Nandyala bypoll heats up Kurnool politics in Andhrapradesh. Bookies from all over the state had betting heavily on the result of the by-poll
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X