అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు-పొలిటికల్ హీట్ వేళ జగన్ కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు ఇవాళ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పలువురు అధికారుల్ని స్ధాన భ్రంశం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా అధికారులు కొత్త స్ధానాలకు బదిలీ అవుతున్నారు.

రాష్ట్రంలో ఇవాళ మొత్తం 17 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు అయ్యాయి. ఇందులో ఎల్‌.కె.వి.రంగారావును ఐజీపీ స్పోర్ట్స్‌, సంక్షేమం బాధ్యతలు అప్పగించారు. రైల్వే ఏడీజీగా ఎల్‌.కె.వి.రంగారావుకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆక్టోపస్‌ డీఐజీగా ఎస్‌.వి.రాజశేఖర్‌ బదిలీ అయ్యారు. శాంతిభద్రతల విభాగం డీఐజీగా ఎస్‌.వి.రాజశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డీఐజీగా పి.హెచ్‌.డి.రామకృష్ణ బదిలీ అయ్యారు. టెక్నికల్‌ సర్వీసెస్‌ డీఐజీగా పి.హెచ్‌.డి.రామకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

massive ips transfers in ap amid speculations of early poll plans by ysrcp government

అలాగే పోలీసు శిక్షణ వ్యవహారాల డీఐజీగా కె.వి.మోహన్‌రావు బదిలీ అయ్యారు. కోస్టల్‌ సెక్యూరిటీ డీఐజీగా ఎస్‌.హరికృష్ణకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. గ్రేహౌండ్స్‌ డీఐజీగా గోపినాథ్‌ జెట్టిని నియమించారు. అలాగే న్యయ వ్యవహారాల ఐజీపీగానూ గోపినాథ్‌ జెట్టికి అదనపు బాధ్యతలు అప్పగించారు. 16వ బెటాలియన్‌ కమాండెంట్‌గా కోయ ప్రవీణ్‌ బదిలీ అయ్యారు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని డి.ఉదయభాస్కర్‌ ను ఆదేశించారు. విజయవాడ రైల్వే ఎస్పీగా విశాల్‌ గున్నీకి అదనపు బాధ్యతలు ఇచ్చారు. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ కమాండెంట్‌గా రవీంద్రనాథ్‌బాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రవీంద్రనాథ్‌బాబు కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్నారు.

ఇదే క్రమంలో గుంతకల్లు రైల్వే పోలీసు సూపరింటెండెంట్‌గా అజిత వేజెండ్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
పి.అనిల్‌బాబును పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. రంపచోడవరం అదనపు ఎస్పీ(ఆపరేషన్స్‌)గా జి.కృష్ణకాంత్‌ బదిలీ అయ్యారు. చిత్తూరు అదనపు అడ్మిన్‌ ఎస్పీగా పి.జగదీశ్‌ బదిలీ చేశారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు డి.ఎన్‌.మహేశ్‌ కూడా బదిలీ అయ్యారు. పాడేరు అదనపు ఎస్పీ అడ్మిన్‌గా తుహిన్‌ సిన్హా బదిలీ అయ్యారు. పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్‌గా బిందు మాధవ్‌ గరికపాటిని నియమించారు. విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా పి.వి.రవికుమార్‌ బదిలీ అయ్యారు.

English summary
ap government has issued orders to transfer 17 ips officers today to various places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X