వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాస్టర్ గంధం భువన్ జైకి సీఎం జగన్ అభినందనలు... అతిపిన్న వయసులో పర్వతారోహణలో రికార్డులు...

|
Google Oneindia TeluguNews

ఐఏఎస్, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడి తనయుడు మాస్టర్‌ గంధం భువన్‌ జై తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. గంధం భువన్‌ జై ఇటీవల యూరప్‌ ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎల్బ్రస్ మౌంట్‌ను అధిరోహించారు.తద్వారా ప్రపంచంలోనే అతి పిన్న వయసులో(8 సంవత్సరాల 3 నెలలు) ఆ శిఖరాన్ని అధిరోహించిన బాలుడిగా రికార్డు సృష్టించాడు.

క్షణక్షణానికి మారే వాతావరణంతో పోటీ: అత్యున్నత శిఖరాన్ని అధిరోహించిన గంధం చంద్రుడి కుమారుడు క్షణక్షణానికి మారే వాతావరణంతో పోటీ: అత్యున్నత శిఖరాన్ని అధిరోహించిన గంధం చంద్రుడి కుమారుడు

భువన్‌ జై ప్రతిభను ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా అభినందించారు. భువన్‌ జైతో అతని తండ్రి గంధం చంద్రుడు, కోచ్‌ శంకరయ్య, రెవెన్యూ, పర్యాటక, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ సీఎంను కలిసినవారిలో ఉన్నారు.

master gandham bhuvan jai meets cm jagan along with his father gandham chandrudu

అత్యంత కఠిన పరిస్థితులు, సంక్లిష్ట వాతావరణం మధ్య- రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వత శిఖరాన్ని మూడేళ్ల వయసులో అధిరోహించడం అంటే మాటలు కాదు. పర్వత శిఖరారోహణను దిగ్విజయంగా ముగించుకుని ఇటీవలే భువన్ జై స్వదేశానికి వచ్చారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన భువన్ జైకి తండ్రి గంధం చంద్రుడు సాదర స్వాగతం పలికారు.కొడుకుని ఎత్తుకుని మురిసిపోయారు.

గంధం భువన్ జయ్ ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు. క్రీడలు, పర్వతాల అధిరోహణ పట్ల చిన్నప్పటి నుంచే అతనిలో ఆసక్తి ఏర్పడింది. దీన్ని గమనించిన గంధం చంద్రుడు తన కుమారుడిని ఆ దిశగా ప్రోత్సహించాడు. అనంతపురం జిల్లా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్పోర్ట్స్ కోచ్ శంకరయ్య వద్ద శిక్షణ ఇప్పించాడు. అనంతరం కడప జిల్లా గండికోటలో ఉన్న అడ్వెంచర్ స్పోర్ట్స్ క్లబ్‌లో చేర్పించారు. సాంకేతికంగా మెళకువలను ఇప్పించారు. కఠిన వాతావరణ పరిస్థితులకు తట్టుకుని పర్వతాలను అధిరోహించడానికి శారీరక దృఢత్వమే కాదు..మానసిక బలం అత్యవసరం.

ఎనిమిదేళ్ల చిరు ప్రాయంలో- అలాంటి ఆత్మ విశ్వాసాన్ని, మానిసక బలాన్ని సొంతం చేసుకున్నాడు భువన్. ఎనిమిదేళ్ల వయస్సులోనే అత్యున్నత పర్వత శిఖరాలను అధిరోహించడాన్ని అలవాటుగా మార్చకున్నాడు. ఇదివరకు లఢక్‌లో అతి ఎత్తయిన ఖర్దుంగ్ లా శిఖరాన్ని అధిరోహించాడు. మరోసారి అలాంటి సాహస కృత్యాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. యూరప్‌లో అతిపెద్ద పర్వత శిఖరం మౌంట్ ఎల్బ్రస్‌ను అధిరోహించాడు. ఈ శిఖరం ఎత్తు 5,642 మీటర్లు. ఈ నెల 18వ తేదీన భువన్ జయ్ ఈ రికార్డు నెలకొల్పాడు.

ఇక ఐఏఎస్ అధికారిగా గంధం చంద్రుడు తనదైన మార్క్‌తో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.గతంలో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ప్రజా సమస్యల పరిష్కారంలో విశేషమైన కృషి చేశారు. దళిత వాడల పేర్లను మార్చడం, బస్సు సౌకర్యం లేని విద్యార్థినులకు బస్సు ఏర్పాటు చేయించడం,కోవిడ్ సమయంలో తాత్కాలిక ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటు, ఉపాధి హామీ కూలీలతో కలిసి ఎండలో పనులు చేయడం వంటి కార్యక్రమాలతో ప్రజాదరణ పొందారు. గంధం చంద్రం కుమారుడు భువన్ చిన్నవయసులోనే ప్రపంచ రికార్డ్ సృష్టించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

Recommended Video

Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety

English summary
IAS, Minority Welfare Department Special Secretary Gandham Chandra's son Master Gandham Bhuvan Jai met CM YS Jagan at the CM's camp office,Tadepalli. Gandham Bhuvan Jai recently climbed Mount Elbrus, the highest peak in Europe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X