6న ఏపీలో 5 చోట్ల రీ పోలింగ్ : ఓటింగ్ ఏర్పాట్లలో అధికారులు
అమరావతి : ఎన్నికల సందర్భంగా ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగడంతో ఐదు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 6 సోమవారం రోజున రీ పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ తెలిపినట్టు ఏపీ ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

5 చోట్ల రీ పోలింగ్
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని ఐదు చోట్ల రీ పోలింగ్ నిర్వహించే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కేసానుపల్లిలో 94వ బూత్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులో 244వ బూత్,, నెల్లూరు నియోజకవర్గంలోని పల్లెపాలెంలో ఇసుకపల్లి 41వ బూత్ లో రీ పోలింగ్ నిర్వహిస్తారు.

పకడ్బందీ ఏర్పాట్లు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అటకానితిప్పలో 197వ పోలింగ్ బూత్, యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలో 247వ పోలింగ్ కేంద్రంలో 6న రీ పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.

ఈవీఎంల మొరాయింపు, హింసాత్మక ఘటనలు
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీలో ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయి. కొన్నిచోట్ల సాయంత్రం పోలింగ్ మొదలై ... అర్ధరాత్రి వరకు కొనసాగింది. మరికొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో మళ్లీ పోలింగ్ నిర్వహించాల్సి వస్తోంది. అనంతపురం జిల్లాలో జరిగిన ఘర్షణలో ఇద్దరు కార్యకర్తలు మృతిచెందిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications