• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన గాడ్‌ఫాదర్‌గా చిరంజీవి: పవన్ రాష్ట్రాన్ని ఏలాలి - ఇదే నా కోరిక

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న మూవీ- గాడ్‌ఫాదర్. మెగాస్టార్ చిరంజీవి హీరో. నయనతార, సముద్రఖని, సత్యదేవ్..కీలక పాత్రల్లో నటించారు. దసరా పండగను పురస్కరించరుకుని బుధవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మోహన్ రాజా దర్శకుడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. మోహన్ లాల్ పాత్రను మెగాస్టార్ పోషించారు. రామ్‌చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు.

మనసు మార్చుకున్న ప్రధాని మోదీ..!!మనసు మార్చుకున్న ప్రధాని మోదీ..!!

సమకాలీన రాజకీయాలపై..

సమకాలీన రాజకీయాలపై..

ఇదో పొలిటికల్ థ్రిల్లర్. ప్లాట్ మొత్తం రాజకీయాల చుట్టే తిరుగుతుంది. సమకాలీన రాజకీయ అంశాలను ఇందులో చిత్రీకరించారు. సుమారు 175 కోట్ల రూపాయల వ్యయంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిందీ మూవీ. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చిరంజీవి-రామ్‌చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించినప్పటికీ సినిమాను ఆదరించలేదు అభిమానులు.

గాడ్ ఫాదర్‌పై ఎన్నో అంచనాలు..

గాడ్ ఫాదర్‌పై ఎన్నో అంచనాలు..

ఆచార్య డిజప్పాయింట్ చేయడంతో గాడ్‌ఫాదర్‌పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కడం, మలయాళంలో సూపర్ హిట్ కావడం వంటి అంశాలు- ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా చేశాయి. ఆచార్య తరహాలో ప్రేక్షకులను నిరాశపర్చకూడదనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమాను తీశామని, ఫ్యాన్స్ తన నుంచి కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయంటూ ఇదివరకే చిరంజీవి స్టేట్‌మెంట్ ఇచ్చారు.

మూవీ ప్రమోషన్‌లో..

మూవీ ప్రమోషన్‌లో..

కాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రస్తుతం చిరంజీవి బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై తన వైఖరేమిటనేది తేల్చి చెప్పారు. ఇదివరకు తాను నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీని ఎందుకు కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సి వచ్చిందనే విషయంపైనా స్పష్టత ఇచ్చారు. రాజకీయాలంటే తనకు ఆసక్తి ఉండటం వల్లే పార్టీని నెలకొల్పానని వివరించారు.

 పవన్ కల్యాణ్‌పై..

పవన్ కల్యాణ్‌పై..

తన తమ్ముడు పవన్ కల్యాణ్‌ గురించి చిరంజీవి ప్రస్తావించారు. పవన్ నిజాయితీగా ఉంటాడని స్పష్టం చేశారు. ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తాడని ప్రశంసించారు. పవన్ నిజాయితీ, నిబద్ధత తనకు చిన్నప్పటి నుంచీ తెలుసని అన్నారు. పవన్ కల్యాణ్ వంటి నిబద్ధత ఉన్న నాయకుడు రాష్ట్రానికి కావాలని వ్యాఖ్యానించారు. పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ప్రజలు ఇచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చిరంజీవి చెప్పారు.

జనసేనకు మద్దతుపై..

జనసేనకు మద్దతుపై..

పవన్ కల్యాణ్ నెలకొల్పిన జనసేన గురించి చిరంజీవి మాట్లాడారు. తాను భవిష్యత్తులో జనసేనకు మద్దతు ఇస్తానో.. లేదో తెలియదని అన్నారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ మంచి నాయకుడు అవుతాడని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఏలే నాయకుడు కావొచ్చని చెప్పారు. ఆ అవకాశం ప్రజలు ఇచ్చే రోజు రావాలనేదే తన అభిమతమని పేర్కొన్నారు.

 పవన్ ఎదుగుదల కోసమే..

పవన్ ఎదుగుదల కోసమే..

పవన్‌ కల్యాణ్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని మెగాస్టార్ భరోసా ఇచ్చారు. పవన్ ఒక పక్క, తాను ఒక పక్క ఉండకూడదనే ఉద్దేశంతోనే రాజకీయాల నుంచి వైదొలిగానని వివరించారు. పవన్ రాజకీయంగా ఎదిగేందుకే తాను రాజకీయాలకు దూరం అయ్యానని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు దూరంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారాయన. తాను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నానే కాని.. రాజకీయం తన నుంచి దూరం కాలేదని అన్నారు.

English summary
May be someday Pawan Kalyan may become the CM, Chiranjeevi love for Jana Sena leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X