మహాశివరాత్రి అని గుడికి వెళ్తే..: అమ్మాయిపై ప్రేమోన్మాది ఘాతుకం
కాకినాడ: మంగళవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని గుడికెళ్లిన ఓ యువతిపై ప్రేమోన్మాది దాడికి తెగబడ్డాడు. కాకినాడలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ప్రేమ పేరుతో వేధిస్తున్న ప్రసాద్ అనే యువకుడు.. మద్యం మత్తులో ఈ దాడికి ఒడిగట్టినట్టు గుర్తించారు. జరిగిన సంఘటనతో యువతి తీవ్ర భయాందోళనకు లోనైంది.

ప్రేమించమని..:
కాకినాడలోని సాంబమూర్తినగర్‌కు చెందిన యువతి(23)స్థానికంగా ఎంబీఏ చదువుతోంది. కాకినాడ పోర్టులో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసే ఆకుల ప్రసాద్ అనే యువకుడు ఆమెను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

పీకలదాకా తాగొచ్చి..:
డెయిరీఫామ్ సమీపంలోని రాజీవ్ గృహకల్పలో నివాసముండే ప్రసాద్.. తనను ప్రేమించాల్సిందిగా యువతిపై పదేపదే ఒత్తిడి తెస్తున్నాడు. తన వెంట పడవద్దని యువతి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే మహాశివరాత్రి రోజు ఫూటుగా మద్యం సేవించి వచ్చి ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

గుడి వద్దే కత్తితో దాడి..:
మంగళవారం మహాశివరాత్రి కావడంతో యువతి తమ ఇంటికి సమీపంలోని గుడికి వెళ్లింది. అక్కడికి వచ్చి తనను ప్రేమించాలని నానా గొడవ చేశాడు ప్రసాద్. తన వెంట పడవద్దని యువతి ఖరాఖండిగా చెప్పడంతో.. వెంట తీసుకొచ్చిన కత్తితో ఆమెపై దాడి చేశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో ముగ్గురిపై కూడా ప్రసాద్ కత్తితో దాడి చేశాడు.

స్థానికులు అడ్డుకోవడంతో..:
గుడి వద్దే ఉన్న స్థానికులు కుడిపూడి సత్యనారాయణ, పితాని శ్రీనివాసరావు, మేడిశెట్టి సదాసాంబశివరావులు అడ్డుకోవడంతో యువతి ప్రాణాలతో బయటపడింది.
అయితే ప్రసాద్ దాడిలో ఆమె మెడ భాగం కింద స్వల్ప గాయాలయ్యాయి. అలాగే అడ్డుకోవడానికి ప్రయత్నించినవారికి కూడా గాయాలయ్యాయి. ఓ వ్యక్తికి చెవిభాగంలో తీవ్ర గాయమైనట్టు తెలుస్తోంది. యువతి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications