జనసైనికులూ జాగ్రత్త- మరో సారి ఎటాక్ : నాగబాబు హెచ్చరిక..!!

మెగా బ్రదర్ నాగబాబు వరుస ట్వీట్లతో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. ప్రభుత్వానికి సూచనలతో పాటుగా హెచ్చరికలు చేసారు. జనసైనికులను అలర్ట్ చేస్తూ ట్వీట్లు చేసారు. "మీరు మీ ప్రభుత్వ విధానాలు ఇలాగె ఉంటే మాత్రం గెలిచే అవకాశం కాదు కదా కనీసం గౌరంగా ఓడిపోయే అవకాశం కూడా కోల్పోతారు"..ఇది నా సలహా అంటూ నాగబాబు ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా చేసిన ట్వీట్ లో "వైసీపీ ప్రభుత్వం కి ఒక సలహా .ఇలాంటి పనికిమాలిన పనులకి టైం వేస్ట్ చేయకండి . మీకు ఇంకా ఏడాది 5మంత్స్ టైం వుంది.ప్రజలకి ,రాష్ట్ర అభివృద్ధి కి టైం వెచ్చించి కనీసం కొంత ఆయన మంచి గవర్నెన్స్ ని ఏపీ కి అందించండి.రేపు జరగబోయే ఎలక్షన్స్ లో బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు"..అంటూ పేర్కొన్నారు.

ఏపీ మంత్రుల మీద జనసైనికులు దాడి చేసే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయంటూ వస్తున్న వార్తల పైన నాగబాబు స్పందించారు. ఇప్పటికే వైసీపీ నేతలు ఈ నివేదికల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిఘా విభాగం నివేదక పేరుతో జనసేన పైన కుట్ర చేస్తున్నారంటూ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. తాజాగా నాగబాబు ట్విట్టర్ వేదికగా దీని పైన స్పందించారు. అందులో.." జనసేన..వైసీపీ నాయకుల మీద దాడిచేయటం...ఇంటెలిజెన్సు హెచ్చరిక ..సీక్రెట్ గ పంపిన సర్కులర్ మీడియా కి అందటం..ఓహో ఇప్పుడు జనసేన మీద మరో సారి ఎటాక్ చెయ్యటానికి రంగం సిద్ధం..జనసైనికులు జాగ్రత్త ..వైజాగ్ ఇన్సిడెంట్స్ లాంటివి చాలా ఉంటాయి..." అంటూ పేర్కొన్నారు.

Mega Brother Nagababu Alerts on Janasainiks over latest inelligence reports

విశాఖ ఎపిసోడ్ తరువాత జనసేన వర్సస్ వైసీపీ మధ్య రాజకీయంగా హోరా హోరీగా విమర్శలు - ప్రతి విమర్శలు - సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. విశాఖ విమానాశ్రయం కేంద్రంగా మంత్రుల పైన ప్రణాళికా బద్దంగానే దాడులు జరిగాయంటూ పోలీసులు నిర్ధారించారు. విశాఖలో పవన్ కళ్యాణ్ తో పోలీసుల తీరు పైన జనసేన చేసిన ఆరోపణలను పోలీసు అధికారులు ఖండించారు. ఇక, తాజాగా టెక్కలి జనసేన కార్యాలయం పైన దాడి ఆ పార్టీ నేతల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇదే సమయంలో నిఘా వర్గాల నివేదికల పేరుతో జరగుతున్న ప్రచారంతో పార్టీ నేతలు తమ కార్యకర్తలను అప్రమత్తం చేస్తున్నారు. ఇదంతా కుట్ర అని పేర్కంటూ..అప్రమత్తంగా ఉండాలని జనసైనికులకు సూచించటం రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+