నాగబాబు నామినేషన్ వేళ కీలక పరిణామాలు..!!

ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు పైన కసరత్తు కొనసాగుతోంది. అయిదు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జనసేన అభ్యర్దిగా మెగా బ్రదర్ నాగబాబు ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. కూటమి నుంచి మిగిలిన నలుగురు అభ్యర్ధులు ఇంకా ఫైనల్ కాలేదు. సహజంగా కూటమి అభ్యర్ధులంతా కలిసి నామినేషన్ దాఖలు చేస్తారు. ఇప్పుడు నాగబాబు ఇతర అభ్యర్ధుల కంటే ముందుగానే తన నామినేషన్ కు సిద్దమయ్యారు. దీంతో, మిగిలిన నలుగురి గురించి చర్చ మొదలైంది.

నాగబాబు నామినేషన్
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ రోజు (శుక్రవారం) ఉదయం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ పత్రాలపై గురువారం సాయంత్రమే అభ్యర్థితో సంతకాలు చేయించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది జనసేన ఎమ్మెల్యేలు సంతకాలు చేసారు. మొత్తం జనసేన ఎమ్మెల్యేలతోనే సంతకాలు చేయటం పైన చర్చ జరిగింది. అనేక తర్జన భర్జనల తరువాత జనసేన తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. నాగబాబు ఎమ్మెల్సీ కావటం ఖాయం అవ్వటంతో.. ఇక చంద్రబాబు ప్రకటించిన విధంగా మంత్రిగానూ అవ్వటం లాంఛనమే.

Mega Brother Nagababu to file nomination for MLC seat in MLA quota today as Pawan Decision

పవన్ నిర్ణయంతో
2024 ఎన్నికల సమయంలో నాగబాబు అనకాపల్లి నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేయా లని భావించారు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి ఇచ్చారు. పొత్తు కోసం సీటును త్యాగం చేశారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం పని చేశారు. ఆ తర్వాత రాజ్యసభ సీటు వస్తుంద నే ప్రచారం జరిగింది. అందులో సీట్లు తక్కువగా ఉండటంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇద్దామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇక.. ఇప్పుడు అయిదు స్థానాల ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు వేళ తొలుత నాగబాబుకు సీటు ఖాయమని భావించారు. అయితే, అనూహ్యంగా నాగబాబుకు కార్పొరేషన్ పదవి ఇస్తారని.. రాజ్యసభకు పంపుతారంటూ కొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది.

Take a Poll

ఆ నలుగురు పై కసరత్తు
దీంతో, పవన్ ఈ ప్రచారానికి ముగింపు పలికేలా నాగబాబును పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్దిగా ప్రకటించి.. నేడు నామినేషన్ కు నిర్ణయించారు. ఇక కూటమి నుంచి మరో నలుగురు అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉంది. ఇందు కోసం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. నాలుగు స్థానాల కోసం భారీ స్థాయిలో ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్ధుల ను ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, గతంలోనూ పొత్తులో ఉన్న పార్టీలతో కలిసి అందరూ ఒకే ముహూర్తంలో అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నాగబాబు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మిగిలిన నలుగురు అభ్యర్దిత్వాలు ఈ రోజు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+