మాజే జేడీ లక్షీనారాయణకు "మెగా" ఆహ్వానం - ప్రత్యేక అతిథిగా..!!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో మాజీ జేడీ తాను విశాఖ నుంచి పోటీ చేస్తానని గతంలోనే స్పష్టత ఇచ్చారు. కానీ, ఏ పార్టీ నుంచి అనే అంశం పైన క్లారిటీ ఇవ్వలేదు. ఏపీలో కొత్త పార్టీల ఎంట్రీ వేళ ఆయన అడుగులు ఆసక్తిగా మారుతున్నాయి. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసిన మాజీ జేడీ ఓడారు. ఆ తరువాత కొంత కాలానికే జనసేన వీడారు. ప్రస్తుతం సామాజిక సేవ.. విశాఖ కేంద్రం అక్కడ ప్రధాన అంశాలపైన ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు మాజీ జేడీకి మెగా ఫ్యామిలీ నుంచి ఆహ్వానం వచ్చింది. అదే ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు

మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు

మెగాస్టార్ చిరంజీవి మానస పుత్రిక బ్లడ్ బ్యాంక్. రేపు (ఆదివారం) హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఒక ముఖ్యమైన కార్యక్రమం జరగనుంది. మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారు. చిరంజీవి సోదరి మాధవి ఈ బ్లడ్ డోనేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందు కోసం సబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. సినీ - ఇతర రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. మెగా ఫ్యాన్స్ తో పాటుగా జనసేన ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బ్లడ్ డొనేషన్ పైన అవగాహన పెంచటంతో పాటుగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.
సీబీఐ మాజీ జేడీకి ప్రత్యేక గుర్తింపు

సీబీఐ మాజీ జేడీకి ప్రత్యేక గుర్తింపు


ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో రక్తదానం చేసిన వారికి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ప్రధానం చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్ సంతకాలతో ఉన్న సర్టిఫికెట్స్ రక్తదానం చేసిన వారికి అందిస్తారు. ఎవరికైనా రక్తం అవసరంలో ఉన్న వారికి రక్తదాతలు సిఫార్సు చేస్తే వెంటనే అవసరంలో ఉన్న వారికి రక్తం అందింస్తారు. అదే విధంగా రక్తదానం చేసిన వారికి ఈ సారి ప్రత్యేకంగా ఇచ్చిన ధృవపత్రాలతో ఇతరత్రా సదుపాయాలు కల్పిస్తున్నారు. హైదరాబాద్ తో పాటుగా విశాఖలో ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో చికిత్స బిల్లుల్లో రాయితీ పొందే విధంగా అవకాశం కల్పిస్తున్నారు.

రక్తదాతలకు ప్రత్యేక సదుపాయాలు

రక్తదాతలకు ప్రత్యేక సదుపాయాలు

బ్లడ్ డొనేషన్ క్యాంపుకు వచ్చే వారి కోసం నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు. రక్తదానం చేసిన వారికి సత్కారాలు నిర్వహించాలని నిర్ణయించారు. అదే విధంగా రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎల్ బీ నగర్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు సాయింత్రం ఎల్ బి నగర్ వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంకును కొద్ది రోజుల క్రితం బిటీష్ డిప్యూటీ హైకమిషనర్ సందర్శించి రక్తదానం చేసారు. తన అభిమానులే తన బ్లడ్ బ్యాంకు సక్సెస్ అవ్వటానికి కారణమని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు రేపు నిర్వహించే ఈ భారీ కార్యక్రమం సక్సెస్ దిశగా నిర్వహాకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+