భోళాశంకర్ పై భారీ ట్రోలింగ్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నిన్న విడుదలైన చిత్రం భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకుడు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర దీన్ని నిర్మించారు. 8 సంవత్సరా క్రితం తమిళంలో అజిత్ హీరోగా విడుదలైన ఘనవిజయాన్ని సాధించిన వేదాళం సినిమాకు రీమేక్ చేశారు. తమన్నా కథానాయిక కాగా చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ స్వరాలనందించారు.
విడుదలైన మొదటిరోజు మొదటి ఆటకే ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. అభిమానులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. మొదటి నుంచి వారు మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేయొద్దని కోరుతున్నారు. కానీ సినిమా గట్టిగా హిట్టవుతుందనే నమ్మకంతో చిరంజీవి ముందుకువెళ్లారు. అయితే మళ్లీ మెహర్ భారీ డిజాస్టర్ ఇచ్చాడు. నెటిజన్లు అతన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం కాస్త పర్వాలేదని, మొదటి భాగం మరీ దారుణమని, కామెడీ ట్రాక్ అసలు పండలేదని, పాటలు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదంటున్నారు. పాత చింతకాయ పచ్చడి లా పాత సినిమాల మూసలో ఉందని, ఖుషి సినిమాలోని నడుము సన్నివేశం చెడగొట్టారని, చిరంజీవి కూడా పవన్ కల్యాణ్ రిఫరెన్స్ వాడుకోవాల్సిన దుస్థితి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తమన్నా రోల్ కూడా చిరాకు తెప్పించిందంటున్నారు. నిన్నటి నుంచి భోళాశంకర్ మీద మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీమర్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. కనీసం రీమేక్ సినిమా తీయడం కూడా రాలేదంటూ మెహర్ రమేష్ ను ఆడుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే మెహర్ ఎక్స్ ప్రెషన్స్ ఎలా ఉంటాయో అనిపిస్తోంది.












Click it and Unblock the Notifications