నేనూ క్యాన్సర్ బారినపడ్డా, కానీ.. మెగాస్టార్ చిరంజీవి సంచలనం; అభిమానులకు షాక్!!

టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు . 67 ఏళ్ల వయస్సులో కూడా యువ హీరోలా సినిమాల్లో నటిస్తూ, తనదైన స్టైల్ డాన్సులతో అదరకొడుతున్న చిరంజీవి అభిమానులు అందరూ షాక్ అయ్యే విషయం వెల్లడించారు. తాను క్యాన్సర్ బారిన పడ్డానని, ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల కోలుకున్నానని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

నానక్ రాంగూడాలోని స్టార్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించిన ఆయన క్యాన్సర్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల ఏఐజీ ఆస్పత్రిలో కొలనోస్కోపీ చేయించుకోవడం వల్ల ఆ రిపోర్ట్ లో తనకు శరీరంలో పాలిప్స్ ఉన్నట్టుగా డాక్టర్లు గుర్తించారని, ఆ పాలిప్స్ ను అలాగే వదిలేస్తే మెలాగ్లిన్ గా మారే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు అని చిరంజీవి వెల్లడించారు.

Megastar Chiranjeevi sensation that he was affected with cancer but taken treatment at early stage

80 నుంచి 90 శాతం పాలిప్స్ మెలాగ్లిన్ గా మారే అవకాశం ఉంటాయని డాక్టర్లు చెప్పడంతో డాక్టర్లు తనకు సర్జరీ నిర్వహించి పాలిప్స్ రిమూవ్ చేశారని చిరంజీవి వెల్లడించారు. ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడంతోనే తాను బతికాను అని, క్యాన్సర్ విషయాన్ని చెప్పడానికి తాను భయపడడం లేదని చిరంజీవి తెలిపారు. క్యాన్సర్ పై అవగాహన లేకపోతే తన పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయమేస్తుందని చిరంజీవి పేర్కొన్నారు.

తనకు ఎలాంటి దురలవాట్లు లేవు అని చెప్పిన చిరంజీవి, తాను సోషల్ గా మద్యం తీసుకుంటానని, వ్యాయామం, ఆరోగ్యకరమైన భోజనం చేస్తానని చెప్పారు. తనకంటూ ప్రత్యేకమైన న్యూట్రిషనిస్ట్ ఉంటారని వెల్లడించారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అనుకునేవాడినన్నారు. కానీ ఒక వయసు దాటిన తర్వాత కొలన్ క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం ఉందని, అందుకే ఏఐజి కి వెళ్లి కొలనోస్కోపీ చేయించుకున్నాను అని తెలిపారు.

తన శరీరంలో క్యాన్సర్ టిష్యూలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారని, అలాగే వదిలేస్తే భవిష్యత్తులో ప్రమాదం ఉందని చెప్పి వాటిని అప్పుడే తొలగించారని చిరంజీవి పేర్కొన్నారు. ముందుగా గుర్తించడం వల్లే తాను క్యాన్సర్ మహమ్మారిని జయించానని చిరంజీవి తెలిపారు. అభిమానులు, సినీ కార్మికులకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తానన్న చిరంజీవి, అభిమానుల కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తానన్నారు.

హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలలో కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లకు ఏర్పాటు చేస్తానని చిరంజీవి తెలిపారు . క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచడానికి తాను కృషి చేస్తానన్నారు చిరంజీవి. జీనోమిక్స్ టెస్టుతో ముందస్తుగానే క్యాన్సర్ ను గుర్తించవచ్చని అన్నారు. క్యాన్సర్ ను ముందుగానే గుర్తిస్తే అది పెద్ద జబ్బు కాదని చిరంజీవి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+