జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం సెంట్రర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు . ఈసారి అలాంటి తప్పు జరగ్గకుండా జాగ్రత్తపడుతున్నారు.
దీనిలో భాగంగానే కాపులు అధిక సంఖ్యలో ఉండే పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారాయన. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ విసృతంగా పర్యటించారు.నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన పవన్ కల్యాణ్.. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తన స్నేహితులతో ఇక్కడ కార్పొరేట్ స్థాయి ఆస్పత్రిని కట్టిస్తానని నియోజకవర్గ ప్రజలకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. మంగళవారం పిఠాపురంలో జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే తమ్ముడు పవన్ కల్యాణ్ తరుఫున ప్రచారం నిర్వహించడానికి మెగాస్టార్ చిరంజీవిరెడీ అవుతున్నారని తెలుస్తోంది. చిరంజీవి ఇప్పటికే కూటమి నేతలకు తన మద్దతు ప్రకటించారు.
ఇప్పుడు నేరుగా తన తమ్ముడు పవన్ తరుఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మరీ పిఠాపురంలో జనసేన పార్టీ తరుఫున చిరంజీవి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు అండగా జబర్థస్త్ ఆర్టిస్టులు జనసేనకు ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ మద్దతు ఉండటంతో పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు ఈజీ అని కూటమి నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మద్దతు కూడా తోడైతే పవన్‌కు భారీ మెజార్టీ రావడం ఖాయమని ఆయన అభిమానులు చెబుతున్నారు. మరీ తమ్ముడుకు అండగా చిరంజీవి ప్రచారం చేస్తారో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications