HBD Chiranjeevi:బర్త్‌డే రోజు తిరుమలలో రికార్డుల రారాజు
Megastar Chiranjeevi birthday: నేడు.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. 69వ జన్మదిన వేడుకలను జరుపుకొంటోన్నారు. ఆయనకు బర్త్‌డే విషెస్ సునామీలా వచ్చిపడుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్.. ఇలా తేడాలేమీ ఉండట్లేదీ విషయంలో సెలెబ్రిటీస్ అందరూ బాస్‌ను గ్రీట్ చేస్తోన్నారు.
తన జన్మదినం సందర్భంగా చిరంజీవి శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య సురేఖ, కుమార్తెతో కలిసి ఈ తెల్లవారు జామున స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆ సమయంలో వారి వెంట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కొందరు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉన్నారు.

శ్రీవారి దర్శనం కోసం బుధవారం రాత్రే చిరంజీవి.. తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. తిరుమలలో ఆయనకు ఘన స్వాగతం లభింంచింది. టీటీడీ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. ఈ తెల్లవారు జామున కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు మెగాస్టార్.
దర్శనానంతరం శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల వారి మండపంలో చిరంజీవికి ఆశీర్వచనాలను పలికారు టీటీడీ అర్చకులు. తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాన్ని బహూకరించారు. ఆలయం వెలుపల పలువురు భక్తులు ఆయనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించారు.
పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి సన్నిధిలో చిరంజీవి దంపతులు#Chiranjeevi #MegaStarChiranjeevi #Surekha #HBDChiranjeevi #HappyBirthdayChiranjeevi #HBDMegastarChiranjeevi #HBDMegastar pic.twitter.com/TtFdwyxh4Y
— oneindiatelugu (@oneindiatelugu) August 22, 2024
ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఆయన నటిస్తోన్న 156వ సినిమా ఇది. మైథలాజికల్- అడ్వెంచర్‌గా తెరకెక్కుతోంది. మల్లిడి వశిష్ట దర్శకుడు. వశిష్ట ఇదివరకు నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన బింబిసారకు దర్శకత్వం వహించాడు. తన తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు.
ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో భారీ సినిమాను తెరకెక్కిస్తోన్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ కింద నిర్మాతలు వీ వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఈ ఫాంటసీ మూవీపై ఇప్పటికే పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది.
మీకు చిరంజీవి సినిమాల్లో ఇష్టమైన సినిమా ఏంటో తెలియజేయండి..??#HBDChiranjeevi #HappyBirthdayChiranjeevi #HBDMegastarChiranjeevi #HBDMegastar pic.twitter.com/X0ROmnhOND
— oneindiatelugu (@oneindiatelugu) August 22, 2024
కాగా- తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. మంగళవారం నాడు 73,082 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,972 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.46 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది గంటల సమయం పట్టింది.












Click it and Unblock the Notifications