జగన్‌తోనే ఉంటా: మీడియా కథనాలపై మేకపాటి

నెల్లూరు: తాను పార్టీ మారుతానట్లు మీడియాలో వచ్చిన వార్తలపై వైయస్సార్ కాగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడి బిజెపిలో చేరుతున్నట్టు కొన్ని పత్రికల్లో వచ్చే కథనాలు తననెంతో బాధించాయని, అలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి కార్యకర్తలకు, నాయకులకు స్పష్టం చేశారు.

గురువారం నెల్లూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని పత్రికలు తన వ్యక్తిత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ కోసం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్న వ్యక్తిత్వం తనదని చెప్పారు.

Mekapati condemns media reports on his party change

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇబ్బందులకు గురి చేయడాన్ని సహించలేక తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని, సోనియాగాంధీకే సవాలు విసిరిన వ్యక్తత్వం తనదని చెప్పారు.

నెల్లూరు పార్లమెంట్ ఉపఎన్నికల్లో తనను 2లక్షల 91 వేల పై చిలుకు మెజార్టీతో గెలిపించారని ఆయన గుర్తు చేశారు. జగన్ నిర్ణయాలకు కట్టుబడి తాను పార్టీలో వ్యవహరిస్తున్నానే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడంలేదన్నారు. అదే విధంగా పార్లమెంట్‌లో సైతం జగన్ ఆదేశానుసారమే స్పందిస్తున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+