జగన్ మెచ్చి న మంత్రి-పాలనపై తనదైన ముద్ర-రాజకీయాలు తెలియని నేత
కులాల కుమ్ములాటలతో, కక్షా రాజకీయాలతో కునారిల్లుతున్న రాష్ట్రంలో వాటన్నింటికీ అతీతంగా తన పనితీరుతో, నిబద్ధతతో చెరగని ముద్ర వేసిన అరుదైన నేత మేకపాటి గౌతం రెడ్డి. ఎనిమిదేళ్ల క్రితం తొలిసారి ఎమ్మెల్యే అయినా, దాదాపు మూడేళ్ల క్రితం తొలిసారి మంత్రి అయినా, ఇప్పటికీ రాజకీయాలు చేయడం తెలియని నేత గౌతం రెడ్డి. అన్నింటికంటే ముఖ్యంగా తనపై సీఎం జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వైసీపీ సర్కార్ కు భవిష్యత్ ఆశాకిరణంగా పేరు తెచ్చుకున్న గౌతం రెడ్డి మృతి అందరినీ కలిసివేస్తోంది.

మేకపాటి గౌతం రెడ్డి
మేకపాటి గౌతం రెడ్డి అనగానే గుర్తుకొచ్చేది ఆయన చిరునవ్వు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ జగన్ కేబినెట్ లో మంత్రి అయిన ఉన్నత విద్యావంతుడు గౌతం రెడ్డి. తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వృధా చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా పరిశ్రమలు తీసుకొచ్చేందుకు గౌతం రెడ్డి చేసిన కృషి అనిర్వచనీయమైనది.
తాజాగా దుబాయ్ లో దాదాపు ఐదు వేల కోట్ల పెట్టుబడుల్ని రాష్ట్రానికి తెచ్చేందుకు సంతకాలు కూడా చేసిన గౌతం రెడ్డి స్వరాష్ట్రానికి రాగానే హఠాన్మరణం చెందడం రాష్ట్రాన్ని విషాదంలో ముంచెత్తింది.

రాజకీయాలు తెలియని నేత
రాజకీయాల్లో ఉంటూ రాజకీయాలు తెలియని నేతగా పేరు తెచ్చుకోవడం అంత సులువు కాదు. రాజకీయాల్లో ఉంటూ రాజకీయాలు చేయకుండా ఉండటం కూడా అంత సులువు కాదు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి ఒకటీ అరా నేతలు మినహాయిస్తే సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న వారు కూడా రాజకీయ నేతలుగానే పేరు తెచ్చుకున్నారు.
అలాంటి కోవకే వచ్చే నేత మేకపాటి గౌతం రెడ్డి. తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినా ఏనాడూ రాజకీయాలు చేయని, చేయలేని అరుదైన నేత గౌతం రెడ్డి. సొంత జిల్లా నెల్లూరులోనే కాదు రాష్ట్రంలోనూ ఏనాడు రాజకీయ విమర్శల జోలికెళ్లకుండా ఆయన తన పనితీరుతోనే మెప్పించేందుకు ప్రయత్నించారు.

కరోనాలో ఏపీకి అన్నీ తానే
2020లో ఏపీపై విరుచుకుపడ్డ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం వద్ద భారీ వ్యూహాలేవీ లేవు. ఆరోగ్యమంత్రి కమ్ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఈ విషయంలో బాగా వెనుకబడ్డారు. కరోనాను ఎదుర్కొనే పరికరాలు, యంత్ర సామాగ్రిని తెప్పించడం, సకాలంలో వాటిని వైద్యులకు అందించగలగడం అంటే ఆషామాషీ కాదు.
అసలే కొత్త రకం వైరస్. దీన్ని ఎదుర్కొనేందుకు ఆరోగ్యమంత్రిని కూడా వెనక్కి నెట్టి మేకపాటి తనదైన శైలిలో దూసుకుపోయారు. అన్నింటికంటే మించి ఏపీ కరోనాను ఎదుర్కొంటున్న తీరును తనకున్న ఆంగ్ల బాషా పరిజ్ఞానంతో జాతీయ మీడియాకు సైతం వివరించడం ద్వారా జగన్ ప్రభుత్వానికి ఇమేజ్ పెంచారు.

జగన్ మెచ్చిన మంత్రి
అన్నింటికంటే మించి జగన్ కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో అందరి కంటే ఎక్కువ విద్యావంతుడిగా, సమర్దుడిగా, నిబద్ధత కలిగిన మంత్రిగా మేకపాటి గౌతం రెడ్డి తెచ్చుకున్న పేరు ప్రత్యేకం. ఐటీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి మంత్రిగా నియమించి సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌతం రెడ్డి నిరంతరం శ్రమించారు. ఈ క్రమంలోనే మూడుసార్లు కరోనా బారిన పడ్డారు.
కేబినెట్ లో అత్యంత వివాద రహితుడిగా, జిల్లా రాజకీయాల్లో, నియోజకవర్గ రాజకీయాల్లో సైతం తనను ఇబ్బందిపెట్టిన వారిని సైతం పల్లెత్తు మాట అనకుండా రాజకీయాలు సాగించిన నేత గౌతం రెడ్డి.
జగన్ తనకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో నూటికి నూరు మార్కులు తెచ్చుకున్న గౌతం రెడ్డికి ఈసారి కేబినెట్ విస్తరణలో కొనసాగింపు ఇవ్వడం ఖాయమనే అంచనాలున్నాయి. అలాంటి సమయంలో గౌతంరెడ్డి హఠాన్మరణం జగన్ కు సైతం భారీ నష్టం కలిగించనుంది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications