ఉదయగిరిలో పోటీపై మేకపాటి రాజమోహన్ రెడ్డి కీలక ప్రకటన..!!
వైసీపీ కంచుకోట నెల్లూరులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. అందులో ఇద్దరు టీడీపీ నుంచి పోటీ చేయటం ఖాయమని జిల్లాలో ప్రచారం సాగుతోంది. నెల్లూరు రూరల్ తో పాటుగా వెంకటగిరిలోనూ వైసీపీ కొత్త ఇంఛార్జ్ లకు బాధ్యతలు కేటాయించింది. ఉదయగిరి విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉదయగిరిలో పోటీ..వైసీపీ గెలుపు పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి తీరు పైన అన్న రాజమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. క్రాస్ ఓటింగ్ చేయటాన్ని తప్పుబట్టారు. చంద్రశేఖరరెడ్డికి డబ్బు అవసమైతే సర్దుబాటు చేస్తామని చెప్పానని వెల్లడించారు. తాము గతంలోనూ జగన్ తోనే ఉన్నామని..భవిష్యత్ లోనూ జగన్ తోనే ఉంటామని స్పష్టం చేసారు. ఇదే సమయంలో ఉదయగిరి నుంచి చంద్రశేఖరరెడ్డి కుమార్తె రచనా రెడ్డి పేరు ఇంఛార్జ్ గా జగన్ అడిగితే చెబుతానని రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. ఇక, తాజాగా ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు నెల్లూరులో మేకపాటి నివాసంలో రాజమోహన్‌రెడ్డిని కలిశారు. వారికి రాజమోహన్ రెడ్డి కీలక సూచనలు చేసారు.

ఉదయగిరి టికెట్ నిర్ణయం పూర్తిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన ప్రకారమే ఉంటుందని, ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థి విజయం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎవరికి టికెట్ ఇచ్చినా మేకపాటి కుటుంబం వారికి పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఉదయగిరిలో సమావేశం ఏర్పాటు చేసి అన్ని మండలాల నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో మాట్లాడి చిన్ని చిన్న సమస్యలు ఉన్నా పరిష్కారం చేసుకుందామని తెలిపారు. ఉదయగిరికి మేకపాటి కుటుంబానికి నలభై ఏళ్ల అనుబంధం ఉందని, చంద్రశేఖరరెడ్డి వ్యవహారంతో కొంత ఇబ్బంది వచ్చిందన్నారు. సీఎం జగన్ కు అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉందన్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చాలా కోణాల్లో పరిశీలించి చేస్తారని తెలిపారు.
త్వరలో అభ్యర్థి విషయంపై స్పష్టత వస్తుందన్నారు. ఆ తర్వాత ఉదయగిరిలో సమావేశం ఏర్పాటు చేసి అన్ని మండలాల నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో మాట్లాడి చిన్ని చిన్న సమస్యలు ఉన్నా పరిష్కారం చేసుకుందామని చెప్పారు. మరోసారి జగన్ ను సీఎంగా చేసుకునేలా పార్టీ విజయం కోసం పనిచేయాలని సూచించారు. చంద్రశేఖరరెడ్డి వ్యవహారం పైన మేకపాటి కుటుంబం తరపున ఉదయగిరి ప్రజలకు రాజమోహన్‌రెడ్డి క్షమాపణలు చెప్పారు. త్వరలోనే రాజమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ ను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications