నేడు, రేపు బల్కంపేట్ రూట్ లో ట్రాఫిక్ మళ్లింపులు- ఈ రూట్ లో..
హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగే పండుగలలో బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయ కల్యాణోత్సవం ఒకటి. నేడు అమ్మవారి కల్యాణోత్సవం జరుగనుంది. రేపు రథోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించడానికి పెద్ద ఎత్తున భక్తులు బల్కంపేట్ చేరుకుంటోన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు.
ఈ నేపథ్యంలో ఆలయం పరిసర ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ రూట్ లో నేడు, రేపు ట్రాఫిక్ ను మళ్లించారు. ఈ తెల్లవారుజామున ట్రాఫిక్ మళ్లింపు ఆరంభమైంది. బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో వాహనదారులు బల్కంపేట్ ఆలయం వైపు వెళ్లే ప్రధాన రహదారి నుంచి ఇతర మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్ నుంచి ఫతేనగర్ మధ్య ఉన్న లింక్ రోడ్లు,బైలేన్లను పూర్తిగా మూసివేశారు.

గ్రీన్‌ల్యాండ్స్, సత్యం థియేటర్ జంక్షన్ మీదుగా బల్కంపేట్ వైపు వెళ్లే వాహనదారులను ఎస్ఆర్ నగర్ టీ కూడలి వద్ద మళ్లించారు. ఈ వాహనాలను ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకే గూడ ఎక్స్ రోడ్స్ మీదుగా శ్రీరామ్ నగర్ క్రాస్ రోడ్స్, సనత్ నగర్ లేదా ఫతేనగర్ రోడ్డు వైపునకు అనుమతిస్తారు. అలాగే గ్రీన్‌ల్యాండ్స్, ఫుడ్ వరల్డ్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఫుడ్ వరల్డ్ ఎక్స్ రోడ్స్ వద్ద సోనాబాయి దేవాలయం, సత్యం థియేటర్ మీదుగా మైత్రివనం వైపునకు మళ్లించారు.
ఫతేనగర్ ఫ్లైఓవర్ మీదుగా ఆలయం మీదుగా వెళ్లే వాహనాలను హైదరాబాద్ కిచెన్ మార్ట్ సమీపంలోని కొత్త వంతెన వద్ద మళ్లించారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ గుండా కట్టమైసమ్మ ఆలయం, బేగంపేట్ వైపునకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక బేగంపేట్, కట్టమైసమ్మ ఆలయం వైపు నుంచి బల్కంపేట్ వచ్చే ట్రాఫిక్‌ను బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్, మాతా ఆలయం, సత్యం థియేటర్, మైత్రివనం మీదుగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) July 21, 2026
🚨 Traffic Alert 🚨
⚠️ Heavy traffic congestion is being experienced due to VIP movement.
📍 Affected Stretches:
• Necklace Rotary → VV Statue
• Nirankari → VV Statue
🚗 Vehicular movement is slow on the above routes.
👮 Hyderabad Traffic Police personnel are on… pic.twitter.com/RcJypPNa2K
ఈ వచ్చే వేలాది మంది భక్తుల సౌకర్యం కోసం ట్రాఫిక్ పోలీసులు పలు పార్కింగ్ స్థలాలను గుర్తించారు. ఆర్ అండ్ బీ కార్యాలయం ప్రాంగణం, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, డీకే రోడ్డులోని పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్ సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. అలాగే నేచర్ క్యూర్ హాస్పిటల్ వైపు వెళ్లే రహదారి, ఫతేనగర్ అండర్ బ్రిడ్జ్ ఖాళీ స్థలం, నేచర్ క్యూర్ హాస్పిటల్ ఆవరణ, సనత్ నగర్‌లోని జీహెచ్‌ఎంసీ ప్లేగ్రౌండ్‌లలో వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అత్యవసర ఇబ్బందులు ఉంటే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబర్ 90102-03626 కు కాల్ చేయవచ్చని సూచించారు.












Click it and Unblock the Notifications