Mekapati Vikram Reddy : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మేకపాటి విక్రమ్ రెడ్డి .. !
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 10కి 10 సీట్లు అందించిన నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఆ పార్టీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీపై తిరుగుబాటుచేసి సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరిలో ఒకరైన మేకపాటి విక్రమ్ రెడ్డి ఇవాళ స్పందించారు.
కొన్ని ఛానళ్లు,సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నారనే వార్తా కథనాలను ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నామనే వార్తా కథనాలన్నీ దుష్ప్రచారం మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుల్లోనే మా ప్రతి అడుగు అని ఆయన స్పష్టం చేశారు. "వైఎస్ - మేకపాటి" కుటుంబాల అనుబంధం తెలుగు రాష్ట్రాలకు తెలుసని విక్రమ్ రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్- దివంగత మేకపాటి గౌతమ్ ల స్నేహం ప్రత్యేకం అన్నారు.

సీఎం జగన్ లోనే స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డిని చూసుకుంటున్నామని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. అన్న దూరమైనప్పుడు ఇంటికి పెదన్నలా ముఖ్యమంత్రి ఓదార్పు, భరోసాను మరువమని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. గౌతమ్ అన్న ఆశయాలను నెరవేర్చడంలో సీఎం చొరవ ఆత్మకూరు ప్రజలూ మరచిపోరన్నారు.
మేకపాటి కుటుంబం విలువలు, విశ్వసనీయతను అసత్య ప్రచారాలతో దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమన్నారు. నిజాయతీతో రాజకీయాలు చేసేవారిపై బురదజల్లే కథనాలు రాయవద్దని హితవు పలికారు.












Click it and Unblock the Notifications