ఏపీకి చల్లటి కబురు మోసుకొచ్చిన వాతావరణశాఖ!

ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి విదర్భ, కర్ణాటకమీదగా సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉంది. మరఠ్వాడా ప్రాంతాలమీదగా విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్ల్రో ఓ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సోమవారం నుంచి ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది.

రాయలసీమ జిల్లాల్లో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో సోమవారం వర్షాలు కురవనున్నాయి. ఇవన్నీ ఇలా ఉండగా మరికొన్ని జిల్లాల్లో మాత్రం మంచు, ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. ఇటువంటి విభిన్న తరహా వాతావరణం ఉండటం చాలా అరుదని అంచనా వేస్తున్నారు.

Meteorological Department announced rains in andhra pradesh

మరోవైపు తెలంగాణలో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. సోమ, మంగళవారాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురవనున్నాయి. రానున్న 48 గంటల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. మూడురోజులుగా రాష్ట్రమంతటా ఇదే తరహా వాతావరణం నెలకంది.

గతవారం కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2 నుంచి 5 డిగ్రీల అధికంగా నమోదయ్యాయి. ప్రస్తుతం వాతావరణం ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత మాత్రం ఎండలు మండిపోతాయని వాతావరణశాఖ తెలిపింది. మహా శివరాత్రి తర్వాత సాధారణంగానే ఎండలు పెరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న విభిన్న వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే వర్షాలు కురిసినా ఇబ్బందే.. కురవకపోయినా ఇబ్బందే అన్నట్లుగా ఉంటోందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+