చంద్రబాబు తీరు అప్రజాస్వామికం.. ల్యాంగ్ పూలింగ్ పేరుతో దోపిడి: మేథాపాట్కర్
భూమి అంటే బంగారంతో సమానమని, అలాంటి బంగారం లాంటి భూములను చంద్రబాబు లాగేసుకుంటారని మేథాపాట్కర్ మండిపడ్డారు.
విజయవాడ: ప్రముఖ పర్యావరణవేత్త మేథాపాట్కర్ ఈరోజు అమరావతిలో పర్యటించారు. రాజధాని కోసం చంద్రబాబు సర్కార్ సేకరించిన భూములను ఆమె పరిశీలించినట్లు తెలుస్తోంది. ఏటా మూడు పంటల్లో పండే భూములను రాజధాని కోసం వినియోగించడం భవిష్యత్తులో ఆహార భద్రతకు ముప్పు కలిగించడమేనని అన్నారు.
ఏపీ రాజధానిలో ఉన్న అసైన్డ్ భూములు ప్రభుత్వ భూములేనని చంద్రబాబు కొత్త నిర్వచనం చెబుతున్నారని మేథాపాట్కర్ విమర్శించారు. 2013 భూసేకరణ చట్టంలో మార్పులు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. రైతులు, రైతు కూలీలు, ప్రజా సంఘాల ఉద్యమాలతో 2013భూసేకరణ చట్టం ఏర్పడిందన్నారు.

భూమి అంటే బంగారంతో సమానమని, అలాంటి బంగారం లాంటి భూములను చంద్రబాబు లాగేసుకుంటారని మేథాపాట్కర్ మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో చంద్రబాబు దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications