వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

102 మంది పిల్లల జీవితాలకు మెట్రో కారిడార్ గండం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాదులోని అమీర్‌పేటలో మెట్రో కారిడార్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు విహార్‌ పిల్లలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. ఈ శిశు విహార్‌లో 102 మందికి పైగా పిల్లలున్నారు. మెట్రో కారిడార్ కోసం రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ యూసుఫ్‌గుడాలోని శిశు విహార్‌ను వేరే చోటికి మార్చింది.

అమీర్‌పేటలోని శిశువిహార్‌ను తరలించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మెట్రో కారిడార్ కారణంగా శిశువిహార్ భవనం పోయే ప్రమాదం ఉంది. అమీర్‌పేటలో మెట్రో కారిడార్ పనులు సాగుతున్నాయని, దీంతో అందులో ఉన్న 102 మంది పిల్లలను అమీర్‌పేటలోని మహిళాశిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి తరలించారని చెబుతున్నారు.

 Metro corridor puts kids at risk

అయితే, ఆ పిల్లల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. నిర్మాణం జరుగుతున్న స్థలంలో పిల్లలను ఉంచడం ప్రమాదకరమని, వారంతా ఆరేళ్ల వయస్సు లోపు పిల్లలని, నిర్మాణం పనుల వల్ల దుమ్ము చెలరేగి వారి ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉందని అంటున్నారు.

పిల్లలను వేరే చోటికి తరలించే విషయంపై చర్చలు సాగుతున్నాయని, నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు అంటున్నారు. మెట్రో కన్‌స్ట్రక్షన్ శిశు విహార్ భవనం మొత్తాన్ని తీసేసుకుందని, అక్కడ స్టేషన్ ప్లాట్‌ఫారం కడుతున్నారని చెబుతున్నారు.

English summary
The Ameerpet Metro corridor is proving to be a major risk for the government run Shishu Vihar, which houses more than 110 kids. The Women and Child Welfare Department in Yousufguda was shifted to facilitate the corridor, but this Shishu Vihar is yet to be shifted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X