హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాదం: కెసిఆర్‌తో మెట్రో రైలు అధికారుల భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ఆగిపోయిన నేపథ్యంలో సంబంధిత అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఆయనతో మంగళవారం సచివాలయంలోని సీ బ్లాక్‌లో సమావేశమయ్యారు.

మెట్రో పనులపై నీలి నీడలు కమ్ముకున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం సూచించిన చారిత్రక ప్రదేశాల్లో మెట్రో రైలు భూమార్గం నుంచి వెళ్లే విధంగా పనులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు అధికారులకు సూచించింది.

Metro rail projects officers meet KCR

ఆ విధంగా చేస్తే తమకు భారీగా నష్టం వస్తుందని, అదనపు భారం పడుతుందని, ఆ విధంగా చేయలేమని, ముందుగా అనుకున్న ప్రకారం పనులు సాగుతాయని అన్న నేపథ్యంలో మంగళవారం ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

చారిత్రక కట్టడాలను పరిరక్షించే ఉద్దేశంతో కెసిఆర్ హైదరాబాదులోని కొన్ని చోట్ల భూగర్భంలో మెట్రో రైలు మార్గాలు వేయాలని సూచించారు. అయితే, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు.

English summary
Hyderabad metro rail project officers met Telangana CM K Chandrasekhar rao, as the works stalled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X