ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు... ఇళ్లలో నుంచి పరుగులు తీసిన జనం

హైదరాబాద్: ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు చీమకుర్తి, చినగంజాం, ఇంకొల్లు కొరిశపాడు, బల్లికురవ మండలాలతో పాటు పలు గ్రామాల్లో 3 నుంచి 4 సెకన్లపాటు భూమి కంపించింది.

ఇళ్లలోని సామగ్రి స్వల్పంగా కదిలాయి. భయాదోళనకు గురైన ప్రజలు ఇళ్ల లోంచి బయటకు పరుగులు తీశారు. వరుసగా రెండు సార్లు భూమి కంపించినట్లు ప్రజలు భయంభయంగా చెప్పారు. నాగులుప్పలపాడులో రెండు సార్లు భూమి కంపించినట్లు గ్రామస్థులు తెలిపారు.. పెద్ద శబ్ధం వచ్చింది. చీరాల, చీమకుర్తి, ఇంకొల్లులో గ్రానైట్ క్వారీల్లో రాయిని బయటికి తీస్తా ఉంటారు.

Mild Earthquake in Prakasam District

గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూమి కంపించింది. మురికిపూడి, మద్దిరాల, రాజాపేట, గోపాలవారిపాలెం, ఎడవల్లితో పాటు చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాల్లో 3-4 సెకన్ల పాటు భూమి కంపించింది.

తవ్వకాల వల్ల భూ పొరల అడ్జెస్ట్ మెంట్ జరగడంతో భూ ప్రకంపనలు సంభవించాయని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే, తరచూ సంభవిస్తున్న భూ ప్రకంపనలతో నిత్యం ప్రజలు భయాందోళనలతో కాలం వెళ్లదీయాల్సి వస్తోందని వాపోయారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+