పాలు పొంగిపోయాయని ఆత్మహత్య..?

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో జరిగిన ఒక విషాద ఘటన యావత్ రాష్ట్రాన్ని షాక్ కి గురి చేస్తోంది. చిన్న విషయం ఎంత పెద్ద దుస్థితికి దారితీస్తుందో చూపించిన ఈ సంఘటన.. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఈ దుర్ఘటన ఒక కుటుంబాన్ని మాత్రమే కాకుండా సమాజాన్నే కలచివేసేలా నిలిచింది. ఇంతలా చెబుతున్న ఈ ఘటన ఏంటంటే.. పాలు పొంగిపోయాయని ఆత్మహత్య చేసుకోవడం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. ఇక్కడ ఊహించని మరో ట్విస్ట్ ఏంటంటే చనిపోయినది భార్య కాదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..

చిన్న గొడవ కాస్తా..

కడప బాలాజీనగర్‌కు చెందిన వెంకటసుబ్బయ్య (53), అనురాధ దంపతులు సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఇద్దరు కుమార్తెలతో జీవనం సాగిస్తున్న ఈ కుటుంబంలో కూడా ఇతర ఇళ్లలాగే చిన్న చిన్న మనస్పర్థలు ఉండేవి. గల్ఫ్‌లో పనిచేసి వచ్చిన వెంకటసుబ్బయ్య, ఇటీవల స్వగ్రామంలో చిన్న దుకాణం పెట్టుకుని జీవితం కొనసాగిస్తున్నారు. అయితే ఆదివారం నాడు స్టవ్‌పై పెట్టిన పాలు పొంగిపోవడం-ఇద్దరి మధ్య వాగ్వాదానికి కారణమైంది.

milk-overflow-leads-to-husband-and-wife-and-also-ends-with-suicide-at-kadapa-district-in-ap

దీంతో భర్త సుబ్బయ్య నీకు ఎన్ని సార్లు చెప్పినా ప్రయోజనం లేదంటూ కోపంతో తలను గోడకేసి కొట్టుకునే క్రమంలో చిన్నగాయమైంది. దీంతో భయపడిన భార్య అనురాధ బయటికి వచ్చి కూర్చున్నట్టు చెబుతున్నారు. ఆ సమయంలోనే భర్త ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్టు వాపోతున్నారు. ఆమె కొద్ది సేపటికి ఇంట్లోకి వెళ్లి చూడగా భర్త ఫ్యాన్‌కు వేలాడుతుండడంతో కేకలు వేయగా.. చుట్టుపక్కల వారు వచ్చి వెంకటసుబ్బయ్యను కిందికి దించిన కొద్దిసేపటికే మృతి చెందినట్టు స్పష్టం చేస్తున్నారు.

కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆర్థిక ఒత్తిడులు, జీవనశైలి మార్పులు, రోజువారీ చిన్న చిన్న విభేదాలు ఆయన మనసుపై నెమ్మదిగా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అయితే వెంకటసుబ్బయ్య మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని.. ఇద్దరు కుమార్తెలకు తండ్రి కోల్పోవడం ఎంతటి వేదనో ఊహించుకోవచ్చని స్థానికులు ఎమోషనల్ అవుతున్నారు. ఈ విషాదం ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక అని.. జీవితం ఎంతో విలువైనదని చిన్న చిన్న సమస్యల కోసం మనల్ని మనం కోల్పోవడం కాదని, వాటిని ధైర్యంగా ఎదుర్కొనే మార్గాన్ని నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+