హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మజ్లీస్, ఎంబిటి ఘర్షణ: తీవ్ర ఉద్రిక్తత (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీలోని యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలో మజ్లిస్, ఎంబిటి పార్టీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని సాలం చౌక్ వద్ధనున్న పోలింగ్ స్టేషన్ ఆవరణలో ఆ రెండు పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో వారు తమ తమ పార్టీ అభ్యర్థులకు ఫోన్లు చేయటంతో మజ్లిస్ అభ్యర్థి ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఎంబిటి అభ్యర్థి ఫర్హత్‌ఖాన్‌లు హుటాహుటీన అక్కడకు చేరుకున్నారు.

వీరిద్దరు ఒకేసారి ఎదురుపడటంతో వీరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య వాగ్వాగం జరిగింది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎనిమిది మంది కార్యకర్తలు గాయపడ్డారు. అప్పటి వరకు మాటలతో సముదాయిస్తున్న పోలీసులు పరిస్థితిని అదుపు తెచ్చేందుకు వాల్టా హోటల్ వద్ధ మూడుసార్లు లాఠీఛార్జీ చేశారు.

ఆ తర్వాత కొంత పరిస్థితి అదుపులోకి వచ్చినా, రెయిన్ బజార్ మీదుగా ప్రయాణిస్తున్న ఎంబిటి అభ్యర్థి ఫర్హత్ ఖాన్ వాహనంపై మజ్లిస్ కార్యకర్తలు మరోసారి దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ కూడా కాసేపు అలజడి నెలకొంది. దీంతో పోలీసులు మంతాజ్‌ఖాన్‌ను అరెస్టు చేసి కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు, ఫర్హత్‌ఖాన్‌ను అరెస్టు చేసిన బహద్దూర్‌పురా పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

చార్మినార్ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి బాసిత్‌పై బుధవారం ముర్గీకా చౌక్ వద్ధ మజ్లిస్ కార్యకర్తలు దాడి చేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన బాసిత్‌పై మజ్లిస్ కార్యకర్తలు ముర్గీకా చౌక్ వద్ధ దాడి చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయటంతో, దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులున్నారు.

పాతబస్తీలో ఘర్షణ

పాతబస్తీలో ఘర్షణ

హైదరాబాదు పాతబస్తీలోని యాకుత్‌పురా శాసనసభా నియోజకవర్గంలో మజ్లీస్, ఎంబిటి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

పాతబస్తీలో ఘర్షణ

పాతబస్తీలో ఘర్షణ

మజ్లీస్, ఎంబిటి అభ్యర్థులు తమ తమ ఏజెంట్ల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో ఒకేసారి వచ్చారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పాతబస్తీలో ఘర్షణ

పాతబస్తీలో ఘర్షణ

ఘర్షణకు దిగిన మజ్లీస్, ఎంబిటీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. వారిని చెదరగొట్టారు. ఉద్రిక్త వాతావరణాన్ని సడలించారు.

పాతబస్తీలో ఘర్షణ

పాతబస్తీలో ఘర్షణ

ఎంబిటి, మజ్లీస్ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణను నివారించడానికి పోలీసులు ఇలా వ్యవహరించారు. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

English summary
Tension prevailed in Yakutpura on polling day as supporters of Majlis-e-Ittehadul Muslimeen (MIM) and Majlis Bachao Tehreek (MBT) clashed at SRT Community Hall, a polling booth in the area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X