కమల్ చేస్తున్నారు: ఉండవల్లి, యూటిపై అసద్ ఆగ్రహం

అందుకే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథే సభ జర గకుండా ఆందోళన చేయాలంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ పోడియం వద్దకు పంపుతున్నారన్నారు. బుధవారం తమకు మద్దతిచ్చే వారి సంఖ్య 56 కాగా, గురువారం ఆ సంఖ్య 71కి పెరిగిందన్నారు.
తెలంగాణ ఇచ్చేశామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఇప్పుడు దేనికోసం సభలో ఆందోళనకు దిగుతున్నారో చెప్పాలన్నారు. ఆర్థికపరమైన సంబంధం ఉన్న ఏ బిల్లు అయినా తప్పనిసరిగా లోక్‌సభకు వచ్చి రాజ్యసభకు వెళ్లాలే తప్ప రాజ్యసభ నుంచి లోక్‌సభకు రాదని ఆయన తెలిపారు.
బహుశా తెలంగాణ బిల్లులో ఇలాంటివన్నీ తీసి పక్కన పెడదామని కేంద్రం భావిస్తుండొచ్చని, అదే జరిగితే ఇక బిల్లు ఏముంటుందని ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయ బిల్లు అని, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బిల్లు అని ఉండవల్లి పునరుద్ఘాటించారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరినీ పార్లమెంటులోకి రానివ్వలేదని మండిపడ్డారు. మనం ఉన్నది భారతదేశంలోనా? మరెక్కడైనానా? అని ఉండవల్లి ప్రశ్నించారు.
హైదరాబాద్ యుటిపై మజ్లిస్ ఆగ్రహం
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేసే అవకాశముందనే ప్రచారం మళ్లీ ఊపందుకోవడంతో మజ్లిస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కొందరు సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారని, కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తే తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications