పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ నిలకడ లేని మనిషి అని, ఆయన రాజకీయ వ్యభిచారం చేస్తున్నారంటూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతాపార్టీతో అంటకాగుతూనే, మరోవైపు తెలుగుదేశం పార్టీ ముసుగులో పని చేస్తున్నారని ఆరోపించారు. అసలు పవన్‌ కళ్యాణ్‌ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాడో.. ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారో, ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు దేశం పార్టీ నాయకులు వాపుని చూసుకుని బలుపు అనుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. తమతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారని.. ఆ ఎమ్మెల్యేలెవరో చెప్పాలని సవాల్‌ విసిరారు. 175 నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులే లేరని.. అందుకే ఆ పార్టీ పొత్తులకు వెళుతోందన్నారు.

minister adimulapu suresh slams on janasena chief pawan kalyan

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు లేవని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్పష్టత ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని మంత్రి చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సీమెన్స్ స్కామ్ బయటపడిందని, 300 కోట్ల రూపాయల మేరకు కుంభకోణం జరిగిందని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+