వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వేలో ఇలా.., టిడిపి నేత స్థలం తీసుకుంటాం: అఖిల, యజమానుల ఆగ్రహం

నంద్యాలలో రోడ్లు విస్తరణ ప్రారంభమవుతుండటంతో తన తండ్రి భూమా నాగిరెడ్డి, అలాగే పట్టణ ప్రజల కల నెరవేరుతోందని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాలలో రోడ్లు విస్తరణ ప్రారంభమవుతుండటంతో తన తండ్రి భూమా నాగిరెడ్డి, అలాగే పట్టణ ప్రజల కల నెరవేరుతోందని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

వీరి కల నెరవేరుతున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. మంగళవారం సాయంత్రం నంద్యాలలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులను ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

నంద్యాలపై చంద్రబాబు వ్యూహాలు, ప్రశాంత్ కిషోర్‌తో జగన్ చెక్ నంద్యాలపై చంద్రబాబు వ్యూహాలు, ప్రశాంత్ కిషోర్‌తో జగన్ చెక్

నంద్యాల ప్రజలు 98 శాతం మంది రహదారుల విస్తరణ కావాలని కోరుకుంటున్నట్లు ప్రభుత్వం చేపట్టిన సర్వేలో వెల్లడైందన్నారు. రోడ్ల విస్తరణ ప్రజల కోరిక అన్నారు. దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చుతున్నట్లు అఖిలప్రియ చెప్పారు.

టిడిపి నేత ఫరూక్‌కు నోటీసులివ్వలేదంటున్నారు కానీ..

టిడిపి నేత ఫరూక్‌కు నోటీసులివ్వలేదంటున్నారు కానీ..

పట్టణంలో మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ నోటిసులు ఇవ్వలేదని, అందరూ అక్కడ విస్తరణ జరగదని అనుకుంటున్నారని అఖిల అన్నారు. కానీ ఆయన వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్‌లో ఉన్నారని, అవసరమైనంత వరకు తన స్థలాన్ని స్వాధీనం చేసుకోవచ్చునని ఆర్డీవో, పురపాలక కమిషనర్లకు చెప్పారన్నారు.

Recommended Video

YS Jagan Shock To Bhuma Akhila Priya
అఖిలప్రియ థ్యాంక్స్

అఖిలప్రియ థ్యాంక్స్

రోడ్ల విస్తరణకు స్థలం తీసుకోవచ్చునని చెప్పినందుకు మాజీ మంత్రి ఫరూక్‌కు మంత్రి అఖిలప్రియ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఆమె వెంట సోదరి నాగమౌనిక రెడ్డి, జగత్‌ విఖ్యా రెడ్డి తదితరులు ఉన్నారు.

చంద్రబాబు పర్యటన అనంతరం..

చంద్రబాబు పర్యటన అనంతరం..

కాగా, నంద్యాలలో దీర్ఘకాలంగా ప్రజలు కోరుతున్న రహదార్ల విస్తరణ ఎట్టకేలకు మంగళవారం నుంచి ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు గత నెలలో నంద్యాల పర్యటన అనంతరం ఈ ప్రక్రియ వేగం అందుకుంది. మధ్యాహ్నం నుంచి యంత్రాల సహాయంతో విస్తరణ చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య శ్రీనివాసనగర్‌ కూడలి నుంచి ఖలీల్‌ టాకీస్‌ వరకు ఎడమ వైపు పురపాలక స్థలంలో ఉన్న నిర్మాణాలు, విస్తరణకు అడ్డుగా ఉన్న దుకాణాలను తొలగించారు.

యజమానుల ఆగ్రహం

యజమానుల ఆగ్రహం

ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేతపై యజమానులు మండిపడ్డారు. కేవలం సమావేశానికి రమ్మని తాఖీదులు పంపారని కూల్చివేస్తున్నట్లు ముందస్తు సమాచారం లేదని అందువల్లనే ఎక్కడి సామగ్రి అక్కడే ఉందని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు దుకాణాల్లోని సామగ్రిని రహదారిపై పెట్టి కూల్చి వేశారు. టిడిపి నేతలు వచ్చి యజమానులతో మాట్లాడారు.

English summary
Telugu Desam Party leader and Minister Akhila Priya on Tuesday evening talk about road widening in Nandyal town. She said 98 percent of people ready for road widening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X