బోటు అనుమతుల విధానం మారుస్తాం, ఇక ఒకే డిజైన్ దుస్తులు: అఖిలప్రియ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రయివేటు బోటు ఆపరేటర్లతో భేటీ అయి అనంతరం మంత్రి అఖిలప్రియ మంగళవారం మీడియాతో మాట్లాడారు. బోట్ల విధివిధానాల్లో మార్పులు తెస్తామని చెప్పారు. విధివిధానాల్లో మార్పులు తెస్తామన్నారు. ఈతగాళ్లను గుర్తించేందుకు వారికి ప్రత్యేక యూనిఫాం ఇస్తామని చెప్పారు.

లొంగిపోతాను, నేను యజమానిని కాదు: బోట్ ప్రమాదంపై ఏడుకొండలు

బోట్లు నడిపేందుకు ఇస్తున్న అనుమతులకు సంబంధించి విధానాలను మారుస్తామన్నారు. ప్రస్తుతం జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకునే వెసులుబాటు ఉందని, అనుమతులు తీసుకున్న వారు పర్యాటక శాఖతో ఒప్పందం చేసుకోవట్లేదన్నారు.

Minister Akhila Priya with Boat operatiors

ఈ లోపాలు సరిదిద్దేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త పర్యాటక విధానాన్ని అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇకపై ఘాట్‌ల వద్ద ఈతగాళ్లను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక ఒకే రకమైన దుస్తులు వారికి ఇస్తామన్నారు. ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతులూ లేవన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Tourism Minister AKhila Priya fired at private boat operator on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి