జగన్ పాదయాత్రతో ఏంకాదు: వైసిపి ఆశలపై మంత్రి అమర్నాథ్ నీళ్లు, వర్మ గురించి తెలుసు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసే పాదయాత్ర రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదని మంత్రి అమర్నాథ్ రెడ్డి వైసిపికి ఝలక్ ఇచ్చారు.

టిడిపి నేతలకు రామ్ గోపాల్ వర్మ కౌంటర్: జగన్‌కు హెచ్చరిక

2018 అక్టోబర్ నెలలోనే ఎన్నికలు వస్తాయని, ఆరు నెలల పాటు సాగే జగన్ పాదయాత్ర ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని వైసిపి భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి అమర్నాథ్ రెడ్డి వారికి షాకిచ్చారు.

చాలామంది ఇలా చేశారు

చాలామంది ఇలా చేశారు

అమర్నాథ్ రెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి పాదయాత్రలు చాలామంది చేశారని చెప్పారు. వరణు దేవుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆశీర్వదించాడని చెప్పారు.

భారీ వర్షాలు కురిసినా

భారీ వర్షాలు కురిసినా

ఇంటింటికి టిడిపి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాల తీరుతెన్నులు పరిశీలించామని, ఇంకా మిగిలిన లబ్ధిదారులకు న్యాయం చేస్తామన్నారు. భారీ వర్షాలు కురిసినా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.

 వర్మ ఎలాంటివారో అందరికీ తెలుసు

వర్మ ఎలాంటివారో అందరికీ తెలుసు

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తీస్తానని చెప్పిన రామ్ గోపాల్ వర్మ పైన అమర్నాథ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వర్మ ఎలాంటి వారో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. వ్యాపారమే పరమావధిగా తీసే సినిమాకు టిడిపి స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

ఏం చేస్తాడో వర్మకే తెలియదు, రాకేష్ రెడ్డి తెలియదు

ఏం చేస్తాడో వర్మకే తెలియదు, రాకేష్ రెడ్డి తెలియదు

సెన్సేషన్‌ కోసమే సినిమా తీసి క్యాష్‌ చేసుకోవాలని వర్మ చూస్తున్నారని అమర్నాథ్ రెడ్డి అన్నారు. అతని వెర్షన్‌లో సినిమా తీసినంత మాత్రన ప్రజలు ప్రభావితంకారని, వర్మ తానేం చేస్తాడో అతనికే తెలియదన్నారు. నిర్మాత రాకేష్ రెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని వ్యాఖ్యానించారు. కాగా, రాకేష్ రెడ్డి వైసిపి నేత.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Minister Amarnath Reddy on Friday lashed out at YSR Congress Party chief YS Jaganmohan Reddy for his padayatra and Ram Gopal Varma for his movie.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి