జగన్-మోడీ.. ఒకరికొకరు ఉన్నారనే ధైర్యం, పవన్ కళ్యాణ్ కుమ్మక్కుపై నో డౌట్: అమర్నాథ్
అమరావతి: కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ ఇస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చెప్పారని ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గురువారం అన్నారు. బీజేపీతో వైసీపీ అంటకాగుతోందన్నారు. ఎన్డీయే నుంచి బయటకు రాగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు చెడ్డవారు అయ్యారని మండిపడ్డారు.
2019లో నరేంద్ర మోడీ ఉన్నారనే ధైర్యం చంద్రబాబుకు ఉందని ఎద్దేవా చేశారు. అలాగే, జగన్ ఉన్నారనే భరోసా బీజేపీకి ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల కోసం వైసీపీ, బీజేపీ, జనసేన కుమ్మక్కు అయ్యాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ మూడు పార్టీల తీరును ప్రజలు గమనించాలన్నారు.

రాష్ట్ర విభజనకు బీజేపీ కారణమైనా ఏపీ కోసం కలిసి వెళ్లామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీతో కుమ్మక్కు వల్లే బీజేపీ ధైర్యంగా ఏపీపై కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. స్టీల్ ప్లాంటు విషయంలో కేంద్రంపై ఒంటికాలిపై పోరాడాలన్నారు. సొంత జిల్లా కడపకు అన్యాయం జరుగుతున్నప్పటికీ జగన్ నోరు మెదపడం లేదన్నారు.












Click it and Unblock the Notifications