చంద్రబాబు -పవన్ సీట్ల చర్చల్లో లోకేష్ ఎక్కడ..?
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు ప్రత్యర్ధి పార్టీల పై డైలాగ్ వార్ ప్రారంభించారు. ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అటు టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఇదే సమయంలో ఈ రెండు పార్టీల సీట్లలో జనసేకు 25 వరకు కేటాయిస్తారనే నిర్ణయం పైన మంత్రి అంబటి స్పందించారు. చంద్రబాబు ఇచ్చే సీట్లు తీసుకుంటున్న పవన్ కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
పొత్తుల్లో సీట్లు: టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ 30 సీట్లు కోరగా, 27 సీట్ల వరకు ఖరారరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే జనసేకు ఇచ్చే 20 సీట్లను చంద్రబాబు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. జనసేనకు 25-30 సీట్లు కేటాయించటం పైన మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

చంద్రబాబు జనసేనకు 20-25 సీట్లు ఇవ్వటమే గగనమన్నారు. ఇప్పటికైనా జనసైనికులు అర్దం చేసుకోవాలని సూచించారు. జగన్ ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. దేశంలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం వైయస్ఆర్సీపీ ప్రభుత్వంగా పేర్కొన్నారు.
మార్పులు చేర్పులు: 175 సీట్లు గెలవటమే లక్ష్యంగా అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జనసేన నాయకులు, కార్యకర్తలను పవన్ ముంచుతారని వ్యాఖ్యానించారు. జనసేన కార్యకర్తలు ఆలోచించుకోవాలి, మీరు మోసపోతున్నారని అంబటి పేర్కొన్నారు.
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండో సారి ఏ విధంగా నిలబడ్డాడో, ఆ విధంగా మళ్ళీ గెలిచి సీఎంగా జగన్ గారు రికార్డ్ సృష్టించబోతున్నారని చెప్పుకొచ్చారు.ఎన్ని పద్మవ్యూహాలు పన్నినా ఎందరు కలిసి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీలికలు చేసినా, చరిత్రలో నిలబడే విజయాన్ని జగన్ గారు సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేసారు.

బాలశౌరి బఫూన్: వాళ్లు సీట్లు, నోట్లు లెక్కేసుకునే పరిస్థితిలోనే ఉన్నారు. కనపడినవాళ్ళందరినీ.. రా కదలిరా అంటున్నారు కానీ, ఎవరు కదిలొచ్చే పరిస్థితి లేదన్నారు. లోకేష్ బయటకు వస్తే టీడీపీ ఔట్ అని అంబటి వ్యాఖ్యానించారు. చిత్రంగా లోకేష్ ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు, దాచేసినట్టున్నారని ఎద్దేవా చేసారు.
లోకేష్ ను దాచేసినా, బయట పెట్టినా టీడీపీ ఔటే.. ఇది వాస్తవమని అంబటి వివరించారు. పాదయాత్ర చేసిన వీరుడు, సూరుడు అని చెప్పిన లోకేష్ ను తీసుకెళ్ళి పక్కనపెట్టారని పేర్కొన్నారు. అన్యాయాలు, అక్రమాలు చేసిన బఫూన్ బాలశౌరి అని అంబటి వ్యాఖ్యానించారు. అన్యాయాలు, అక్రమాలు చేశారని కాబట్టే టికెట్ రిజెక్ట్ చేశారని అంబటి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications