విలువలులేని తమకే ఇది సాధ్యం: పవన్ కళ్యాణ్ పై అంబటి సెటైర్లు!!
తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు ఎన్నికల సమయంలో శరవేగంగా మారుతున్నాయి. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటినుంచే వ్యూహాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి నుంచే పొత్తులు కూడా ఏపీ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో తెర మీదకు వచ్చిన కొత్త పొత్తులు కూడా ఆసక్తికరంగా మారాయి.
తాజాగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతుంది. ఎన్నికల్లో జనసేన 9 స్థానాల్లో పొత్తుతో పోటీ చేయనుంది. ఈ ఎన్నికలలో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమిష్టిగా కృషి చేయాలని పొత్తుల్లో భాగంగా నిర్ణయించిన బిజెపి, జనసేన పార్టీలు ఈ మేరకు తదుపరి కార్యాచరణ కూడా ప్రకటించనున్నాయి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లబోతుంది. ఇక ఈ వ్యవహారంపై ఏపీ, తెలంగాణలో జనసేన సాగిస్తున్న రాజకీయంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ కు ఏదైనా సాధ్యమేనని, విలువలు లేని రాజకీయాలు చేయాలంటే పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలడు అంటూ ఆయన విరుచుకుపడ్డారు.
తాజాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ప్రకటన చేసిన నేపథ్యంలో 'విలువలు లేని తమకే ఇది సాధ్యం!' అని ట్వీట్ చేసి, పవన్‌తో చంద్రబాబు, కిషన్‌రెడ్డి ఉన్న ఫొటోలను షేర్ చేశారు. అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై మాత్రమే కాదు.. చంద్రబాబు, కిషన్‌రెడ్డిని కూడా టార్గెట్ చేశారేమో అని ఈ పోస్ట్ ను బట్టి అర్థమవుతుంది.
విలువలులేని తమకే ఇది సాధ్యం !@PawanKalyan pic.twitter.com/J7b7qHf5dL
— Ambati Rambabu (@AmbatiRambabu) November 5, 2023
ఏది ఏమైనా నిత్యం సోషల్ మీడియా వేదికగా చిన్న చిన్న కొటేషన్స్ తోనే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే అంబటి మరోమారు పవన్ కళ్యాణ్ పై విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారంటూ టార్గెట్ చేశారు. అందులో పవన్ చంద్రబాబుతో ఏపీలో, తెలంగాణలో బీజేపీ కిషన్ రెడ్డితో ఉన్న ఫోటో షేర్ చేశారు.












Click it and Unblock the Notifications