పిరికోళ్ళందరూ కలిసే రండి చూసుకుందాం - తాజా సవాల్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీతో ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయి. పవన్ కళ్యాణ్ చెప్పు చూపించి వైసీపీ నేతలకు వార్నింగ్ ఇవ్వటం పైన మంత్రులంతా మండి పడుతున్నారు. పవన్ ను ప్యాకేజీ స్టార్ అంటూ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో తాము ముందు నుంచి చెబుతున్నట్లుగా చంద్రబాబు - పవన్ కళ్యాణ్ భేటీతో నిర్దారణ అయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. విశాఖలో మూడు రోజుల పాటు చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పవన్ విజయవాడ చేరుకున్నారు.
అక్కడ రెండు రోజులు సీఎం జగన్.. వైసీపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసారు. ఇక, చంద్రబాబుతో భేటీ.. వైసీపీ ప్రభుత్వం పైన పోరాటానికి ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల ఐక్యత అవసరం గురించి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఏపీ మంత్రులు చేస్తున్న సవాళ్లలో బాగంగా మంత్రి అంబటి రాంబాబు తాజాగా వరుస ట్వీట్లు చేసారు. జనసైనికులా.. బాబు బానిసలా అంటూ ప్రశ్నించారు. అదే సమయంలో చేసిన మరో ట్వీట్ కలకలం రేపుతోంది. యుద్దానికి సిద్దం అన్నావ్.. చంద్రబాబు సంకెక్కావ్.. పిరికోళ్లందరూ కలిసే రండి చూసుకుందాం అంటూ ట్వీట్ చేసారు. ఇక, శనివారం నుంచి పవన్ కళ్యాణ్ హై ఓల్టేజ్ రాజకీయం నడిపారు. కొద్ది సేపటి క్రితమే పవన్ విజయవాడ నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు.

అటు చంద్రబాబు మళ్లీ మళ్లీ తాము కలుసుకుంటామని చెప్పటం ద్వారా.. 2024 ఎన్నికల్లో పొత్తు దిశగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సీఎం జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయనేది మరోసారి స్పష్టమైంది. వైసీపీ కూడా ఇదే అంచనాతో ఉంది. బీజేపీ అధినాయకత్వం నిర్ణయం పైనే ఇప్పుడు అందరూ ఫోకస్ చేసారు. బీజేపీ కలిసి వస్తే ఏరకంగా ముందుకు వెళ్లాలి.. బీజేపీ వ్యతిరేకిస్తే ఎవరెవరితో కలిసి వెళ్లాలనే దాని పైన మలివిడత భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు - పవన్ తాజాగా ప్రతిపక్షాల ఐక్యత గురించి చేసిన ప్రతిపాదన పైన ఇతర పార్టీల స్పందనకు అనుగుణంగా వీరద్దరూ భవిష్యత్ అడుగులు - పొత్తుల పైన నిర్ణయం తీసుకోనున్నారు.
యుద్దానికి సిద్ధం అన్నావ్
— Ambati Rambabu (@AmbatiRambabu) October 19, 2022
చంద్రబాబు సంకెక్కావ్
పిరికోళ్ళందరూ కలిసే రండి చూసుకుందాం! @PawanKalyan @ncbn
జనసైనికులా ?
— Ambati Rambabu (@AmbatiRambabu) October 19, 2022
బాబు బానిసల ?