Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేణు ప్రశ్నకు బదులేది: ఫ్యాన్స్ ను సన్మార్గంలో పెట్టుకో..ఎవరూ పట్టించుకోరు: పవన్ పై అనిల్..!

Recommended Video

    Anil Kumar Yadav Slams Pawan Kalayan On His Comments Against CM Jagan || Oneindia Telugu

    జనసేన అధినేత పవన్ కళ్యాన్ మీద మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. అసలు పవన్ ను ఏమన పిలవాలో తెలియదని వ్యాఖ్యానించారు. జగన్ దమ్ము గురించి పవన్ మాట్లాడుతున్నారని..ముఖ్యమంత్రి దమ్ము..ధైర్యం ఏంటో ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు. పవన్ పూర్తి స్థాయి పొలిటీషియన్ కాదని..అదే సమయంలో పూర్తిగా సినిమా హారో కూడా కాదని వ్యాఖ్యానించారు. జగన్ మతం..కులం గురించి పదే పదే మాట్లాడుతున్నారని..జగన్ క్రిస్టియన్ అని తెలిసే ప్రజలంతా ఓట్లు వేసారని..కలిసి మెలిసి ఉంటున్న వారి మధ్య చిచ్చు పెట్టటానికే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆయన ఎవరి తాట..తీలు తీయలేరని.. ముందుగా సోషల్ మీడియాలో దుర్మార్గపు పోస్టింగ్ లు పెడుతున్న తన అభిమానులను సన్మార్గంలో పెట్టుకోవాలని సూచించారు. ప్రశ్నిస్తానంటున్న పవన్ ను రేణు దేశాయ్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిని పవన్ ఏ రకంగా పిలిచినా..పట్టించుకొనే వారు ఎవరూ లేరని మంత్రి అనిల్ తేల్చి చెప్పారు.

     ప్రాంతాల మధ్య విభేదాల కోసం ప్రయత్నం..

    ప్రాంతాల మధ్య విభేదాల కోసం ప్రయత్నం..

    పవన్ కళ్యాన్ మీద మంత్రి అనిల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ లో పని చేస్తున్నారన్నారు. గోదావరి జిల్లాలకు వెళ్లి రాయలసీమ గూండాలు అని.. కడప రౌడీలు అని.. రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అంటూ మాట్లాడిన విషయాలను గుర్తు చేసారు. ఇప్పుడు రాయలసీమకు వెళ్లి ఒక సారి పచ్చటి పొలాలు అంటారని...మరోసారి సీమలో కరువు ఉందని..ఎక్కడ ఏం చెబుతారో ఆయనకే తెలయదని ఎద్దేవా చేసారు. పవన్ కళ్యాన్ సత్తా ఏంటో అయిదేళ్లుగా చూసిన ప్రజలు..ఆయన సత్తాకు తగినట్లుగానే తీర్పు ఇచ్చారన్నారు. రాయలసీమ ప్రాంతంలో కనీసం వారి పార్టీకి డిపాజిట్లు రాలేదని వ్యాఖ్యానించారు. అసలు పవన్ ను పొలిటీషియన్ అనలేము..హీరో అనటానికి సినిమాల్లేవు..ఏమని పిలవాలో తెలియటం లేదని ఎద్దేవా చేసారు.

    జగన్ మతం తెలిసే అధికారం ఇచ్చారు..

    జగన్ మతం తెలిసే అధికారం ఇచ్చారు..

    పవన్ కళ్యాన్ పదే పదే జగన్ మతం..కులం గురించి ప్రస్తావిస్తున్నారని మంత్రి అనిల్ చెప్పుకొచ్చారు. తనకు కులాలు...మతాలు లేవంటూనే పదే పదే జగన్ మతం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించారు. ఇలా కుల..మతాల గురించి మాట్లాడావారు అసలు నాయకులా అని నిలదీసారు. 2019 ఎన్నికల్లో జగన్ మతం తెలిసే ప్రజలు ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేసారని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులాలు..మతాల ప్రస్తావన తెచ్చి రాజకీయలు చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ కల్చర్ ను అవహేళన చేసేలా పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అక్కడ తెల్ల చొక్కా..పంచె కట్టుకోవటం అలవాటని..వారికి మాత్రమే పనులు అవుతున్నాయంటూ వ్యాఖ్యానించటం సరికాదన్నారు.

     నీ ఫ్యాన్స్ ను సన్మార్గంలో పెట్టుకో..

    నీ ఫ్యాన్స్ ను సన్మార్గంలో పెట్టుకో..

    తాను చిన్నప్పుడు ఇంగ్లీషు మీడియం లో చదివి ఇబ్బంది పడ్డానని చెబుతున్న పవన్.. మరి తన కుమారుడిని ఇంగ్లీషు మీడియంలోనే ఎందుకు చదివిస్తున్నారని ప్రశ్నించారు. ఎదుటి వారికి నీతులు చెప్పే ముందు నీ ఫ్యాన్స్ ను సన్మార్గంలో పెట్టాలని సూచించారు. సోషల్ మీడియాలో ప్రత్యర్ధి పార్టీల వారిని..ఇంట్లో ఉన్న మహిళలను సైతం వదల కుండా బూతులు తిడుతూ పోస్టింగ్ లు పెడుతున్నారని..వారికి పవన్ మంచి చెప్పాలని సూచించారు. పవన్ సినిమా డైలాగులు చెప్పినట్లుగా తోలు తీస్తా..తాట తీస్తానంటే..ఎవరివీ తీయలేరని చెప్పారు. పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. జగన్ ను అలా పిలుస్తా..ఇలా పిలుస్తా అంటే..ఎలా పిలిచినా పవన్ ను ఎవరు పట్టించుకోరని మంత్రి వ్యాఖ్యానించారు.

    కర్నూలులో అఘాయిత్యం బాబు హాయంలో జరిగింది..

    కర్నూలులో అఘాయిత్యం బాబు హాయంలో జరిగింది..

    పవన్ లేవనెత్తుతున్న కర్నూలు జిల్లాలో ఒక గిరిజన బాలిక పైన జరగిన అఘాయిత్యం 2017లో చంద్రబాబు హయాంలో జరిగిందని మంత్రి చెప్పుకొచ్చారు. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీసారు. తాను కర్నూలు ఇన ఛార్జ్ మంత్రిగా వెళ్లిన సమయంలో తనను బాధిత కుటుంబం కలిసిందని..ఇప్పటికే అదనపు ఎస్పీ రమాదేవి ద్వారా తిరిగి మొత్తం ఘటన పైన విచారణ చేయిస్తున్నామని వివరించారు. అప్పటి నుండి ప్రశ్నించకుండా నిద్రపోయావా అంటూ పవన్ ను నిలదీసారు. జగన్ దమ్ము గురించి పవన్ మాట్లాడుతున్నారని..పవన్ దమ్ము..ధైర్యం ఏంటో ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు.

    రేణూ దేశాయ్ కు సమాధానం చెప్పు..

    రేణూ దేశాయ్ కు సమాధానం చెప్పు..

    పవన్ యువత సన్మార్గం గురించి మాట్లాడుతున్నారని..ముందు నీ సత్ప్రవర్తన చూసుకోవాలని సూచించారు. రేణూ దేశాయ్ అడిగిన ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పాలని సూచించారు. ఇక, ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్న పవన్ కనీసం పత్రికలు చదవినా విషయాలు తెలుస్తాయన్నారు. ఈ నెల 26న కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టీరీకి శంకు స్థాపన జరగనుందని వివరించారు. అర్దం లేని విమర్శలు చేయవద్దని సూచించారు. అయిదేళ్ల కాలంలో ఎన్నో సార్లు తోలు తీస్తా..తాట తీస్తానంటూ చెప్పుకుంటూ తిరిగితే ప్రజలు ఎవరి తాట తీసారో అర్దం కాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు సగం మాట్లాడితే..మిగిలిన సగం పవన్ మాట్లాడుతారని మంత్రి అనిల్ ఆరోపించారుజ

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+