వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కోసం కటౌట్లు కట్టా -భీమ్లా రెమ్యునరేషన్ తెలుసా: నాని ఎవరు - అనిల్ సంచలనం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో సినీ ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా హీరో నాని చేసిన వ్యాఖ్యలు..మంత్రి బొత్సా స్పందనతో మరితంగా సోషల్ మీడియా వేదికగా చర్చ - రచ్చ సాగుతున్నాయి. ఇదే సమయంలో మంత్రి అనిల్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. హీరో నాని ఎవరో నాకు తెలియదంటూ ఎద్దేవా చేసిన మంత్రి అనిల్.. నాకు తెలిసింది కొడాలి నాని మాత్రమే నంటూ సెటైరికల్ గా చెప్పుకొచ్చారు. సినిమా టికెట్ల వివాదంపై తాజాగా స్పందించిన హీరో నాని.. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాని ఎవరంటూ ప్రశ్నించిన మంత్రి అనిల్

నాని ఎవరంటూ ప్రశ్నించిన మంత్రి అనిల్


10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటుందన్న నానీ.. టికెట్ ధరలు పెంచినా కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని.. ప్రభుత్వం కావాలని వారిని అవమానిస్తుందన్నారు. దీనికి స్పందన గా మంత్రి అనిల్ సిని పరిశ్రమ..అందులోని కొందరిని టార్గెట్ చేస్తూ ఫైర్ అయ్యారు. మొత్తం సినిమా ఖర్చులో 80 శాతం హీరోల రెమ్యునరేషన్ కు వెళ్తోందని..అసలు సినిమా నిర్మాణ ఖర్చు 20 శాతం మాత్రమే ఉంటుందోన్నారు. ఆ 80 శాతం హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్ ను ప్రేక్షకుల పైన భారం మోపుతారా అని ప్రశ్నించారు.

పవన్ సినిమా కోసం బైక్ అమ్మేసా

పవన్ సినిమా కోసం బైక్ అమ్మేసా

టికెట్ ధర తగ్గితే రెమ్యునరేషన్ తగ్గుతుందని కొందరు బాధ పడుతున్నారని ఎద్దేవా చేసారు. వకీల్‌సాబ్‌, భీమ్లానాయక్‌ తీసిన పవన్‌ కల్యాణ్‌ తన రెమ్యునరేషన్‌ ఎంతో చెప్పాలంటూ మంత్రి అనిల్ డిమాండ్ చేసారు. ఒకప్పుడు తానును కూడా బైక్ అమ్మి పవన్ కళ్యాణ్ కి కటౌట్ లు కట్టానంటూ చెప్పుకొచ్చారు. ఉన్న డబ్బులు ఊడగొట్టుకొన్నా.. ఇప్పుడున్న అభిమానుల పరిస్థితి కూడా అంతే అంతే అని చెప్పుకొచ్చారు. పవన్‌ కల్యాణ్‌ రూ.50 కోట్లు కాకుండా రూ.10 కోట్లు తీసుకుంటే ఈ టికెట్‌ ధరలతో నష్టమే ఉండదన్నారు. సినిమాల్లో అయ్యే ఖర్చులో 80 శాతం ఆ నలుగురికే వెళ్తోందన్నారు.

Recommended Video

Tollywood పండగ చేసుకుంటోంది | Go 35 | Andhra Pradesh || Oneindia Telugu
భీమ్లా నాయక్ కోసం రెమ్యునరేషన్ ఎంత

భీమ్లా నాయక్ కోసం రెమ్యునరేషన్ ఎంత

చారిత్రక, సందేశాత్మక సినిమాలకు గతంలో రేట్లు పెంచుకునేవారు.. కానీ, ఇప్పుడు అన్ని సినిమాలకు పెంచడం ఏంటంటూ నిలదీసారు. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పైన రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం..ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక, ఇప్పుడు సినిమా టిక్కుట్ల ధరలు తగ్గించాలని డిమాండ్ టాలీవుడ్ నుంచి వినిపిస్తోంది. సినిమా థియేటర్ల పైన ప్రభుత్వం చేస్తున్న సోదాలు..సీజ్ చేయటంతో ఎగ్జిబిటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు హీరో నాని చేసిన వ్యాఖ్యలు .. మంత్రుల స్పందనతో ఈ వివాదం మరింతగా రాజుకుంటోంది. ఇక, దీనికి ముగింపు ..పరిష్కారం ఏంటనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోతోంది.

English summary
Minister Anil Kumar Yadav sensational comments on Hero Pawan Kalyan Remunaeration, He reacted on Hero Nani latest comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X