శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖపై దండెత్తి వస్తే - వెనక్కు పంపిస్తాం : మంత్రి అప్పలరాజు..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి రైతుల పాదయాత్ర వ్యవహారం రాజకీయంగా వేడి పెంచుతోంది. ఇప్పటికే ఈ పాదయాత్ర గురించి ఏపీ అసెంబ్లీలోనూ విమర్శలు వినిపించాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ పాదయాత్రను తప్పు బట్టారు. పలువురు అధికార పార్టీ నేతలు ఈ యాత్రను ఉత్తరాంధ్ర పైన దండయాత్రగా అభివర్ణించారు. దీని పైన ఉత్తరాంధ్ర మంత్రులు ఇప్పటికే సీరియస్ కామెంట్స్ చేసారు. తాజాగా.. మంత్రి అప్పలరాజు ఇదే తరహాలో సంచలన వ్యాఖ్యలతో ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్రపై ద్వేషంతో, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనే కుట్రతో విశాఖపై దండెత్తి వస్తే చూస్తూ ఊరుకోమ‌ని అప్పలరాజు హెచ్చ‌రించారు.

పాదయాత్ర పేరుతో రైతుల ముసుగులో టీడీపీ వారు లక్షల్లో వచ్చినా అంతకు రెట్టింపుగా వచ్చి ఉత్తరాంధ్ర ప్రజలు వారిని వెనక్కు పంపుతారని చెప్పుకొచ్చారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే సామాజిక అసమతుల్యత అంటూ కోర్టుల్లో వాదిస్తారా అని ప్రశ్నించారు. అలాంటి ప్రాంతంలో కొన్ని గ్రామాల వారి కోసమే రాజధాని కట్టడానికి వెనుకబడ్డ వర్గాలు ఎందుకు అంగీకరించాలని మంత్రి నిలదీసారు. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద 54 వేల ఎకరాల్లో రైతులకు 11 వేల ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అభివృద్ధి కోసం 30 వేల ఎకరాలు ఖర్చవుతుందని..ఇక, ప్రభుత్వం చేతిలో 10 వేల ఎకరాలే ఉంటుందని మంత్రి లెక్కలు చెప్పారు.

Minister Appala Raju serious comments on Amaravati JAC padayatra, says will not allow them

ఇది ఏ రకంగా త్యాగమవుతుందని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. రైతుల ముసుగులో చేస్తున్న పాదయాత్ర కచ్చితంగా అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం పోరాటాల గడ్డ అని తన ప్రాంతానికి వచ్చి మా గుండెల పై కొడతాం అంటే ఊరుకుంటామా అంటూ ఫైర్ అయ్యారు. పయ్యావుల కేశవ్‌తో సహా టీడీపీ నాయకులు నాలుగు వేల ఎకరాలకు పైగా భూములు అమరావతి ప్రాంతంలో ఎలా కొనుగోలు చేశారని ప్రశ్రించారు. కోట్ల రూపాయల లబ్ది తన బినామీలకు దక్కేటట్లు చంద్రబాబు వ్యవహరించారని మంత్రి అప్పలరాజు ఆరోపించారు.

English summary
Minister Appalaraju sensational commets on Amaravati JAC Padayatra up to Srikakulam, says will not allow them in north coastal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X