'అందుకే సీఎంను కాల్చేయాలంటున్న జగన్, ఓటర్ల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు'
నంద్యాల ఉప ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా పీకేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు గురువారం ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే వైసిపి వికృత చేష్టలకు పాల్పడుతోందన్నారు.
విజయవాడ: నంద్యాల ఉప ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా పీకేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు గురువారం ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే వైసిపి వికృత చేష్టలకు పాల్పడుతోందన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించి వాయిదా వేయించే యోచన
ఈ కారణంగానే ఆందోళనలతో ఎన్నికలు వాయిదా వేయించాలని ఆ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నంద్యాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి ఉపఎన్నికల్ని నిలుపుదల చేయించే యోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారన్నారు.
Recommended Video


అందుకే సీఎంను కాల్చేయాలని, ఉరి తీయాలని
అందుకే ఆ పార్టీ అధినేత జగన్ ముఖ్యమంత్రిని కాల్చేయాలని, ఉరితీయాలని తీవ్ర వ్యాఖ్యలతో నోరు పారేసుకుంటున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఉపఎన్నికల ప్రచారంలో జగన్ అసలైన ఫ్యాక్షన్ నేతలాగానే మాట్లాడుతున్నారని ఆరోపించారు.

ఈసీకి ఫిర్యాదు చేస్తాం
మరోవైపు ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే విషయంలో ఎవరైనా రాజ్యాంగం ప్రకారమే పనిచేయాలని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. వైసిపి చేస్తోన్న కుట్రలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు.

జగన్ మాటలను నంద్యాల ప్రజలు నమ్మరు
నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి సేవా సమితి డబ్బులు పంచుతోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఓటర్ల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని, నంద్యాలలో గెలుపు కోసం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తనకు ఆస్తులు లేవని జగన్ నంద్యాలలో బీద అరుపులు అరుస్తున్నారని, జగన్ మాటలను నంద్యాల ప్రజలు నమ్మరన్నారు.












Click it and Unblock the Notifications