బెదిరిన ఎడ్లు, బండి మీద నుంచి కిందపడ్డ అచ్చెన్న, కదిరి ఎమ్మెల్యేకు సొంత పార్టీలో షాక్
విశాఖపట్నంలోని అనకాపల్లి మండలం తుంపాల గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలు ఎడ్ల బండి పై నుంచి కిందపడ్డారు.
విశాఖ: విశాఖపట్నంలోని అనకాపల్లి మండలం తుంపాల గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలు ఎడ్ల బండి పై నుంచి కిందపడ్డారు. పెద్ద ఎత్తున వచ్చిన జనాలను చూసి, ఎడ్లు బెదరడంతో బండి పైన ఉన్న వారు కిందపడ్డారు.
మంత్రి, ఎమ్మెల్యే తుంపాల గ్రామంలో జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఈ అపశృతి చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, కార్యకర్తలు మంత్రి అచ్చెన్నను, ఎమ్మెల్యే పీలాను లేపారు. వారికి చిన్న గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.

కదిరి టీడీపీ ఎమ్మెల్యేకు నిరసనల సెగ
అనంతపురం జిల్లా కదిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చాంద్ బాషాకు సొంత పార్టీ నుంచే నిరసన సెగ తగిలింది. జనచైతన్య యాత్రలో భాగంగా చాంద్ బాషా నల్లచెరువు మండలం గోరంట్లవారిపల్లెకు వెళ్లారు.
ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ను పార్టీకి దూరం చేస్తున్నారంటూ స్థానిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలుగా టిడిపి కార్యకర్తలు విడిపోయి వాగ్వాదానికి దిగారు. ఇది చిలికిచిలికి గాలివానగా మారడంతో బాహాబాహీకి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి, ఇరువర్గాలకు సర్దిచెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications