'బజారులో రికార్డింగ్‌ డ్యాన్స్‌ చేసుకునే రోజాను అసెంబ్లీలో కూర్చోబెట్టడమా!'

బజారులో రికార్డింగ్‌ డ్యాన్స్‌ చేసుకునే రోజాను తీసుకొచ్చి.. అసెంబ్లీలో కూర్చోబెట్టడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమేనని ఘాటుగా విమర్శించారు.

విశాఖపట్నం: వైసీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రోజాకు టీడీపీ నుంచి కౌంటర్ పడింది. మంత్రులు లోకేష్, అయ్యన్నపాత్రులను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ 'పప్పు.. ఎర్రిపప్పు..' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నుంచి అదే స్థాయిలో కౌంటర్ ఎదురవుతోంది.

తాజాగా రోజా వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అయ్యన్నపాత్రుడు అంతకుమించి వ్యాఖ్యలు చేశారు. ఏకంగా రోజాను బజారులో రికార్డింగ్‌ డ్యాన్స్‌ చేసుకునే వ్యక్తిగా ఆయన అభివర్ణించడం గమనార్హం. ముద్దపప్పు, ఎర్రిపప్పు కన్నా నీచమైన భాష మాట్లాడగలనని కానీ అంతగా దిగజారి తాను మాట్లాడలేనని ఆయన అన్నారు. తాను ఓ బాధ్యాతయుతమైన పదవిలో ఉన్నానని గుర్తుచేశారు.

minister ayyanna patrudu counter attack on roja

బజారులో రికార్డింగ్‌ డ్యాన్స్‌ చేసుకునే రోజాను తీసుకొచ్చి.. అసెంబ్లీలో కూర్చోబెట్టడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమేనని ఘాటుగా విమర్శించారు. కాగా, గురువారం నాడు విశాఖకు రైల్వేజోన్‌ ప్రకటించాలనే డిమాండ్‌తో చేపట్టిన పాదయాత్రలో రోజా మంత్రులు లోకేష్, అయ్యన్నపాత్రుడిపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.

మొత్తం మీద ఘాటు విమర్శలతో ఇరు వర్గాల మధ్య రాజకీయం హీటెక్కుతోంది. అయ్యన్న వ్యాఖ్యలకు రోజా మళ్లీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే.. ఈ విమర్శల పరంపర మరింత ముదరడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+