వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల ఉపఎన్నిక: మంత్రి అఖిలప్రియకు జిల్లా ఎన్నికల అధికారి నోటీసు

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నంద్యాల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపును కాంక్షిస్తూ మాట్లాడినందుకు మంత్రి భూమా అఖిలప్రియకు కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

కర్నూలు: ఏపీ మంత్రి భూమా అఖిలప్రియకు కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ గురువారం నోటీసు ఇచ్చారు. ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రికకు మంత్రి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపును కాంక్షిస్తూ మాట్లాడారు.

దీన్ని గమనించిన మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ కమిటీ(ఎంసీఎంసీ) చైర్మన్‌ అయిన కలెక్టర్‌.. ఇంటర్వ్యూను ఎందుకు పెయిడ్‌ న్యూస్‌గా పరిగణించరాదో చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే నంద్యాల నియోజకవర్గంలోని లోకల్‌ కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌లకు కూడా నోటీసులు జారీ చేశారు.

akhila-priya

తమ అనుమతి తీసుకోకుండా, ఒక పార్టీకి అనుకూలంగా కథనాలు ప్రసారం చేస్తుండటంపై ఎంసీఎంసీ స్పందించింది. అనుమతి లేకుండా ఒక పార్టీ కోసం పనిచేస్తున్నందున మీపై ఎందుకు( సీజ్‌ చేసేందుకు) చర్యలు తీసుకోరాదో తెలపాలని నోటీసుల్లో పేర్కొంది.

నంద్యాలకు చెందిన నంది కేబుల్, నంద్యాల సిటీ కేబుల్‌ నెట్‌వర్క్, ప్రజా కేబుల్‌ నెట్‌వర్క్, శిల్పా కేబుల్‌ నెట్‌ వర్క్‌లకు నోటీసులను కలెక్టర్‌ సత్యనారాయణ జారీ చేశారు. ప్రసారం చేస్తున్న కథనాలను పెయిడ్‌ న్యూస్‌గా ఎందుకు పరిగణించరాదో వివరణ ఇవ్వాలని కూడా నోటీసుల్లో ఆదేశించారు.

English summary
Kurnool District Election Returning Officer and Collector S.Satyanarayana issued a notice to Minister Bhuma Akhila Priya on Thursday. Recently Minister Akhila Priya has given an interview to an English Daily and expressed hope that Nandyal TDP candidate Bhuma Brahmananda Reddy's victory in the upcoming bypoll. For this reason the notice was issued by MCMC and in that notice collector asked that why they have treated that interview is a paid article?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X