వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని రైతుల కౌలు రగడ ... సాంకేతిక సమస్యలతోనే కౌలు జాప్యం.. కావాలనే ఇదంతా అన్న మంత్రి బొత్సా

|
Google Oneindia TeluguNews

రాజధాని అమరావతి రైతులకు కౌలు విడుదల చేస్తున్నట్లుగా ప్రభుత్వం జూన్ 22వ తేదీన ప్రకటించినప్పటికీ అవి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో పడలేదు. దీంతో రైతులు ఆగ్రహించి ఆందోళన బాట పట్టారు. సి ఆర్ డి ఏ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నం చేసిన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. రాజధాని రైతులకు ఇప్పటి వరకు కౌలు డబ్బులు ఇవ్వకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించారు. దీంతో రాజధాని రైతుల కౌలు సమస్య ఏపీలో చర్చనీయాంశం అయింది.

రాజధాని రైతుల కౌలు పై ప్రతిపక్షాల విమర్శలు

రాజధాని రైతుల కౌలు పై ప్రతిపక్షాల విమర్శలు

అమరావతి ప్రాంత రైతులకు కౌలు డబ్బులు ఇవ్వడానికి ఆర్థిక వనరులు లేని ప్రభుత్వం, మూడు రాజధానులు ని ఎట్లా కడతారు అంటూ నిలదీశారు ప్రతిపక్ష పార్టీల నాయకులు . రాజధాని కోసం తమ భూములు త్యాగం చేసిన రైతులు ఆందోళనలు చేస్తే అరెస్టు చేయడం దారుణం అంటూ మండిపడ్డారు. ఇక నేటికీ రాజధాని ప్రాంత రైతుల కౌలు డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై ఒత్తిడి పెంచుతున్నాయి.
ఈ క్రమంలో అమరావతి ప్రాంత రైతులు వార్షిక కౌలు మరియు రెండు నెలల పెన్షన్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది.

వార్షిక కౌలు మరియు రెండు నెలల పెన్షన్ విడుదల చేసిన సర్కార్

వార్షిక కౌలు మరియు రెండు నెలల పెన్షన్ విడుదల చేసిన సర్కార్

వార్షిక కౌలు 158 కోట్ల రూపాయలతో పాటు రెండు నెలల పెన్షన్ 9.73 కోట్ల రూపాయల ను రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు పేర్కొంది .ఈ విషయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు పేర్కొన్నారు. భూ సమీకరణ లో భాగంగా రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల అకౌంట్లలో ఈ నగదు జమ చేయబడుతుందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

సాంకేతిక సమస్యల వల్లే ఆలస్యం జరిగిందని, ఈ విషయం తెలిసి కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు కావాలని రైతులను రెచ్చగొట్టి, ఆందోళనలు చేయించారని ఆయన విమర్శించారు.

 బుధవారమే డబ్బు జమ చేశామన్న బొత్సా .. టెక్నికల్ సమస్యలతోనే జాప్యం

బుధవారమే డబ్బు జమ చేశామన్న బొత్సా .. టెక్నికల్ సమస్యలతోనే జాప్యం

బుధవారమే రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. భూ హక్కు పత్రాలు అమ్ముకున్న రైతులకు కౌలు చెల్లింపులు జరగవని బొత్స ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి సర్వే జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి కౌలు రైతుల పెన్షన్ 5,000 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం భావించిందని పేర్కొన్న బొత్స ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంతో అది సాధ్యం కాలేదని స్పష్టం చేశారు. అందుకే ఈ దఫా 2500 రూపాయలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.

Recommended Video

Telangana People Angry On Electricity Bill Charges
ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాల మండిపాటు

ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాల మండిపాటు

ఏపీ ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం రాజధాని రైతుల విషయంలో సర్కారు తీరుపై ఇప్పుడు జరుగుతున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వ తీరు గర్హనీయమని రాజధాని రైతుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం రాజధాని రైతుల విషయంలో వారి అరెస్టులు గర్హనీయమని ఒప్పందం ఉల్లంఘించవద్దని అన్నారు. రైతుల కౌలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు , టీడీపీ నాయకులు రాజధాని రైతులకు అండగా, రైతుల సమస్యల కోసం, అలాగే రాజధానిగా అమరావతి ఉంచడం కోసం పోరాటాలు చేస్తూనే ఉంది. ఇక ప్రభుత్వ తీరుపై వామపక్ష పార్టీలు కూడా నిప్పులు చెరుగుతున్న పరిస్థితి ఉంది.

English summary
State Municipal Minister Botsa Satyanarayana today said the annual lease of farmers in the capital Amravati would be Rs 158 crore and a two-month pension of Rs 9.73 crore would be credited to farmers' accounts. He criticized the delay due to technical issues, saying that despite knowing this, the leaders of the opposition parties had deliberately provoked the farmers and raised concerns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X