Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘అమరావతి’ కోసం ఎక్కడికైనా వస్తా: బాబుకు రాజమౌళి గ్రీన్ సిగ్నల్

Recommended Video

    Rajamouli over designs of Amaravathi చంద్రబాబు కోసం ఎక్కడికైనా వస్తా: రాజమౌళి

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన శాసనసభ, హైకోర్టు డిజైన్లపై ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారం రోజుల్లో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యే అవకాశముంది.

    మంత్రి నారాయణతో గంటపాటు..

    మంత్రి నారాయణతో గంటపాటు..

    మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌లు సోమవారం హైదరాబాద్‌లో రాజమౌళితో సమావేశమయ్యారు. రాజధాని డిజైన్లను ఆయనకు అందించి గంటపాటు చర్చించారు.

    అధ్యయనం చేస్తా

    అధ్యయనం చేస్తా

    ఆకృతుల ప్రతుల్ని తీసుకున్న రాజమౌళి వాటిపై తన బృందంతో కలిసి అధ్యయనం చేస్తానని తెలిపారు. వీలైనంతగా తానీ ప్రక్రియలో పాలుపంచుకుంటానని, చేతనైన సాయం చేస్తానని రాజమౌళి తెలిపారు.

    ఎక్కడికైనా వస్తా..

    ఎక్కడికైనా వస్తా..

    అమరావతి నిర్మాణం కోసం తాను అవసరమైతే ఎక్కడికైనా వస్తానని కూడా రాజమౌళి వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాజమౌళి రాజధాని నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ నిర్మాణాలు ఎలా ఉండబోతున్నాయానేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజమౌళి.. బాహుబలి1,2 చిత్రాల్లో మాహిష్మతి నగరాన్ని అద్భుతంగా నిర్మించిన విషయం తెలిసిందే.

    చంద్రబాబు పిలుపు మేరకు..

    చంద్రబాబు పిలుపు మేరకు..

    అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లు రూపొందించిన నార్మన్‌, ఫోస్టర్‌ సంస్థ ప్రధాన కార్యాలయమున్న లండన్‌కి రాజమౌళిని తీసుకెళ్లి ఆ సంస్థ సాంకేతిక నిపుణులతో చర్చించాలని సీఎం చంద్రబాబు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి అందుకు సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+