నవాబ్‌కు నారాయణకు పోలికా!: ఏపీ-టి అసెంబ్లీలపై దేవినేని ఆసక్తికరం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, మీడియా ప్రతినిధుల మధ్య శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అమరావతి అసెంబ్లీ గురించి మీడియా అభిప్రాయాన్ని దేవినేని అడిగారు.

స్పీకర్‌పై అవిశ్వాసం: ఏం చేద్దాం.. ఎమ్మెల్యేల మద్దతు లేక జగన్ డైలమా

అమరావతి అసెంబ్లీ బాగుందా... హైదరాబాద్ అసెంబ్లీ బాగుందా అని దేవినేని మీడియాను అడిగారు. దానికి మీడియా ప్రతినిధులు... లాబీలు మరింత విశాలంగా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Minister Devineni interesting comments on AP Assembly building

రాజు చూసిన కళ్లతో వేరేవాళ్లను చూడగలమా అని ప్రతిగా దేవినేని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అసెంబ్లీ భవనాన్ని నిజాం రాజు నిర్మించారని ఆయన అభిప్రాయపడ్డారు.

దానికి మీడియా ప్రతినిధులు.. నవాబ్‌కు, నారాయణకు పోలికా అనేది మీ ఉద్దేశ్యమా అని ప్రశ్నించారు. దానికి దేవినేని.. నేను అలా అనలేదని, నారాయణ చాలా అద్భుతంగా నిర్మించారని చెప్పారు.

జగన్ సవాల్‌పై శ్రీకాంత్ రెడ్డి

మంత్రి పత్తిపాటి పుల్లారావుపై తమ పార్టీ అధినేత వైయస్ జగన్ చేసిన ఆరోపణలపై వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై ఈ సెషన్లోనే తాము అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు.

గతంలో జగన్ చేసిన సవాళ్లకు అధికార టిడిపి స్పందించాలన్నారు. అప్పుడు మంత్రి పత్తిపాటి పుల్లారావు చేసిన సవాల్‌కు కూడా తాము స్పందిస్తామని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. పత్తిపాటిపై జగన్ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Devineni Umamaheswara Rao interesting comments on AP Assembly building on Friday.
Please Wait while comments are loading...