దాడి చేస్తారా: జగన్‌ని దులిపిన దేవినేని, అఖిలను బైకులపై వెంబడించారని..
ఓ మహిళా ఎమ్మెల్యే పైన దాడి చేయడం చాలా దారుణమని, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పచ్చని పంటకు పట్టిన చీడ లాంటి వ్యక్తి అని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ: ఓ మహిళా ఎమ్మెల్యే పైన దాడి చేయడం చాలా దారుణమని, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పచ్చని పంటకు పట్టిన చీడ లాంటి వ్యక్తి అని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త సచివాలయం ముందు నిలుచొని ఒక్క ఇటుక కనిపించలేదని చెప్పడం విడ్డూరమన్నారు. ఇన్ని అవాస్తవాలు మాట్లాడితే ఎలాగన్నారు. జగన్‌ది నోరా లేక తాటిమట్టా అని నిలదీశారు. ఆశించిన పదవి రాలేదని జగన్ మతిభ్రమించి ఏదేదో చేస్తున్నారన్నారు. మహిళా ఎమ్మెల్యే కారుపై వైసిపి కార్యకర్తలు దాడి చేయడం విడ్డూరమన్నారు.

నీచమైన సంస్కృతి: ఎస్వీ మోహన్ రెడ్డి
అఖిల ప్రియ కారు పైన వైసిపి దాడి నీచమైన సంస్కృతి అని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. జగన్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసిపికి భూమా కుటుంబం చేసిన సేవలను జగన్ గుర్తుంచుకోవాలన్నారు. మహిళలు అంటే జగన్‌కు గౌరవం లేదన్నారు.
కాగా, అఖిల ప్రియ కారు పైన దాడి జరిగిందని, కారు అద్దాలు పగిలాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంతేకాదు, అఖిల ప్రియ కారును బైకులతో కొందరు వెంబడించినట్లుగా కూడా వార్తలు వచ్చాయని, అధి సరికాదని వైసిపి నేత అంబటి రాంబాబు అన్నారు.












Click it and Unblock the Notifications