జగన్ వర్గం విషం కక్కుతున్నారు: మంత్రి దేవినేని, ఒంగోలు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంపై మంత్రి దేవినేని ఉమ స్పందించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాల్‌మనీ కేసులో ఉక్కుపాదం మోపుతామని ఆయన చెప్పారు.
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకే ప్రతిపక్ష నేత వైయస్ జగన్ వర్గం విషం కక్కుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు అమరావతి నిర్మాణంలో సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించ తలపెట్టిన సాగు, తాగు నీటి ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని మంత్రి దేవినేని వివరించారు.

ఒంగోలు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
ఒంగోలు పద్మావతి నర్సింగ్‌హోంలో అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున చిన్నపిల్లల వార్డు ఇన్‌క్యుబేటర్ గదిలో మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంక్యూబేటర్‌లో ఐదు రోజుల పసిపాప ఉంది.
మంటలు చెలరేగడాన్ని గమనించిన చిన్నారి తల్లి వెంటనే పాపను తీసుకొని బయటకు పరుగుతీసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, దాదాపు రూ.2లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. షార్ట్‌సర్క్యూట్‌తో ఆసుపత్రిలో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications