ఆ వర్గం టీడీపీకే మద్దతుగా - సమీకరణాలు మారుతున్నాయి : మంత్రి ధర్మాన..!!
మంత్రి ధర్మాన ప్రసాద రావు కీలక వ్యాఖ్యలు చేసారు. సామాజిక సమీకరణాలు..మద్దతు గురించి విశ్లేషించారు.
మంత్రి ధర్మాన ప్రసాద రావు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అంతా ఏకతాటిపై నిలవాలని మంత్రి పిలుపు నిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్ ను అనూహ్య మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎవ్వరైనా ఏ స్థానిక ప్రతినిధి అయినా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తే వెంటనే చర్యలు తప్పవని స్పష్టం చేసారు. వెంటనే పార్టీకి తెలిసి పోతుందన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రులంతా వైసీపీతోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేసారు. విశాఖను రాజధానిగా చేయాలన్న ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. చదువుకున్న వారు ఎవరైనా వైసీపీకే ఓటు వస్తారని మంత్రి ధర్మాన విశ్లేషించారు.
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఇది కీలక సమయంగా ధర్మాన పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో రాజకీయంగా సామాజిక వర్గాలకు దక్కుతున్న ప్రాధాన్యతలను ప్రస్తావించారు. యాదవులకు చట్ట సభల్లో ప్రాధాన్యం ఇవ్వడం ఈ సారి ప్రత్యేకమని చెప్పారు. యాదవులు 83 నుంచి టీడీపీ కే మద్దతుగా ఉన్నారన్నారు. 1999,2004,2009,2014 ఎన్నికల వరకూ నాటి వైయస్ హయాం నుంచి నేటి జగన్ పాలన వరకూ క్రమ క్రమంగా యాదవులు మద్దతిస్తున్నారని విశ్లేషించారు. 1983 నుంచి 2019 వరకూ టీడీపి యాదవులకు శ్రీకాకుళం జిల్లా నుంచి అవకాశం ఇవ్వలేదన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాలుగో పెద్ద కమ్యూనిటీ యాదవులు. కాపు, కాళింగ, వెలమ, తరువాత యాదవ ఇవే కీలక సామాజిక వర్గాలుగా వివరించారు. ప్రస్తుత మండలి ఎన్నికలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. ఇదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించాలని పిలుపు నిచ్చారు.

యాదవ సామాజిక వర్గ నేతలకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యత గుర్తించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఉన్న యాదవులు అంతా వైసీపీ వెనుక నడవాలని కోరారు. దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శనీయంగా ఉంది. ఇక్కడ చూస్తే యాదవ,పక్క జిల్లాలో వాడ బలిజ, ఇంకా మిగిలిన ప్రాంతా లలో బలిజతో సహా ఇతర వెనుకబడిన సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి, రాజకీయ అధికారం దక్కించిన పార్టీ వైసీపీ అని ధర్మాన వివరించారు. వైసీపీకి మద్దతుగా యాదవుల మహా సభను నిర్వహించి, వచ్చే ఎన్నికల్లో మద్దతుగా ఉంటాం అని ఓ తీర్మానం చేయించాలని కోరారు. 1999 నుంచి ఈ జిల్లాలో నాడు వైయస్ఆర్ కు కానీ ఇప్పుడు జగన్ కు కానీ యాదవులు మద్దతుగా ఉన్నారన్నారు. కాపులు కూడా వైసీపీతోనే ఉన్నారని చెప్పారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications